West Bengal : ముదురుతున్న పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ వివాదం.. రిలీవ్ చేయలేమని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ

West Bengal CS Controversy : పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ రిలీవ్‌పై వివాదం రోజు రోజుకు ముదురుతోంది.

West Bengal : ముదురుతున్న పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ వివాదం.. రిలీవ్ చేయలేమని మోదీకి లేఖ రాసిన మమతా బెనర్జీ
Mamata Banerjee
Follow us
uppula Raju

|

Updated on: May 31, 2021 | 11:17 AM

West Bengal CS Controversy : పశ్చిమ్ బెంగాల్ చీఫ్ సెక్రటరీ రిలీవ్‌పై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. అతడిని సెంట్రల్‌లో రిపోర్ట్ చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. దీనికి బదులుగా సీఎం మమతా బెనర్జీ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. అందులో చీఫ్ సెక్రటరీ బందోపాధ్యాయను కేంద్రం వద్ద రిపోర్ట్ చేయమని వెలువడిన ఏకపక్ష ఉత్తర్వు చూసి తాను ఆశ్చర్య పోయానని తెలిపింది. బెంగాల్ ప్రభుత్వం క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని రిలీవ్ చేయలేమని, చీఫ్ సెక్రటరీగా బందోపాధ్యాయను కొనసాగించాలని సీఎం మమతాబెనర్జీ కోరారు.

పశ్చిమ బెంగాల్ చీఫ్ సెక్రటరీ ఆలపన్ బందోపాధ్యాయ ని కేంద్రం ఈ రోజు అయన ఢిల్లీలోని నార్త్ బ్లాక్ కార్యాలయం లో గల పర్సనల్ అండ్ ట్రెయినింగ్ విభాగంలో రిపోర్టు చేయాలని ఆదేశించింది. యాస్ తుఫాను వల్ల కలిగిన నష్టంపై చర్చించేందుకు ప్రధాని మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి సీఎం మమతా బెనర్జీ గైర్ హాజరు కావడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. అందువల్లే ఈ చర్య తీసుకుంది. 1987 కేడర్ ఐఏఎస్ అధికారి అయిన బందోపాధ్యాయను సెంటర్ లోగడ బెంగాల్ రాష్ట్రానికి డెప్యూట్ చేసింది.

కాగా ఈయన పదవీ కాలాన్ని మరో మూడు నెలలు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 24 న నోటిఫికేషన్ జారీ చేసి ఇందుకు అనుమతి కోసం ఈ ప్రతిపాదనను ప్రధానమంత్రి కార్యాలయానికి పంపింది. స్వయంగా మోదీ నిర్వహించిన సమీక్షా సమావేశానికి మమతా బెనర్జీ గైర్ హాజరు కావడాన్ని హోమ్ మంత్రి అమిత్ షా, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువెందు అధికారి బీజేపీ అధ్యక్షుడు నడ్డా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆమె రాక కోసం మోదీతో బాటు గవర్నర్ జగ దీప్ ధన్ కర్ సుమారు అరగంట సేపు వేచి చూశారని తెలిసింది.

Ap Telangana Borders: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ.. పోలీసుల‌కు కొత్త త‌లనొప్పి

Private Hospital Corona: రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృతదేహం ఇస్తాం.. ఎల్బీన‌గ‌ర్ మ్యాక్స్ క్యూర్‌లో ఘ‌ట‌న‌..

Coronavirus: కరోనాను జయించి కోవిడ్‌ బాధితులకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఒకే కుటుంబంలోని 26 మంది