AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యాక్సిన్ పై రాజకీయాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, …హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ మండిపాటు

వ్యాక్సిన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు.

వ్యాక్సిన్ పై రాజకీయాలు చేస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ...హర్యానా  సీఎం  మనోహర్ లాల్ ఖట్టర్ మండిపాటు
Manohar Lal Khattar
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 31, 2021 | 9:50 AM

Share

వ్యాక్సిన్ పై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తున్నారని హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ ఆరోపించారు. తమ ఢిల్లీలో వ్యాక్సినేషన్ డ్రైవ్ పై ఆయన అత్యుత్సాహం చూపుతున్నారని ఖట్టర్ అన్నారు. ఢిల్లీలో రోజూ 2 లక్షల మందికి టీకామందులు ఇవ్వాలని కేజ్రీవాల్ అంటున్నారని, కానీ మేం మాత్రం స్టాక్ ను నిల్వ ఉంచుకునేందుకు రోజూ 50 వేలమందికి వ్యాక్సిన్ ఇస్తున్నామని ఆయన చెప్పారు. 10 లక్షల జనాభాను ప్రాతిపదికగా తీసుకుని పోలిస్తే ఢిల్లీకి ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువగా టీకామందు లభిస్తోందని ఆయన చెప్పారు. తాము కూడా రెండు లక్షలమందికి వ్యాక్సిన్ ఇవ్వగలుగుతామని కానీ ముందు జాగ్రత్త చర్యగా 50 నుంచి 60 వేలమందికి ఇస్తున్నామన్నారు. కేజ్రీవాల్ కాస్త సంయమనంతో మాట్లాడాలని, ఆయన ఈ విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఖట్టర్ వ్యాఖ్యానించారు. హెల్త్ అన్నది రాష్ట్రాలకు సంబంధించిన అంశమని, కేంద్రం అన్ని రాష్ట్రాలకు సహకరిస్తూ న్యాయం చేస్తోందని ఆయన చెప్పారు. ప్రతి చిన్న అంశానికీ అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని దుయ్యబట్టడంలో ఔచిత్యం లేదన్నారు. ఢిల్లీలో 2 కోట్లమంది జనాభా ఉండగా మా రాష్ట్రంలో 2.9 కోట్ల మంది ఉన్నారు.. కానీ మీ ప్రభుత్వం 51 లక్షల ఇంజెక్షన్లు అందుకుంటుండగా మేం ఇంత జనాభాకు కేవలం 58 లక్షల ఇంజెక్షన్లు అందుకుంటున్నాం అని ఖట్టర్ తెలిపారు. అంటే మాకన్నా మీకే ఎక్కువ వ్యాక్సిన్ డోసులు లభిస్తున్నాయన్నారు.

ఇతర రాష్ట్రాలకన్నాఎక్కువగా మీరే లాభపడుతున్నారని, , సంకుచిత రాజకీయాలు మానాలని ఖట్టర్ తీవ్రంగా పేర్కొన్నారు. హర్యానాలో కూడా కోవిద్ కేసులు తగ్గుతున్నట్టు ఆయన తెలిపారు.

మరిన్ని ఇక్కడ చూడండి: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూకు పదవీ గండం తప్పదా ? ఏకమవుతున్న విపక్షాలు ! నిశితంగా గమనిస్తున్న అమెరికా

Chitragupta Temple: భారతదేశంలో ఏకైక చిత్రగుప్తుని ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?? ( వీడియో )

ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..
ఈ రెండు చిరుతిండ్లు తింటే కాలేయం ఖతమే.. జాగ్రత్త పడకపోతే..