AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ap Telangana Borders: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ.. పోలీసుల‌కు కొత్త త‌లనొప్పి

తెలంగాణలో లాక్ డౌన్‌ సడలింపు నిర్ణయంతో.. ఒక్కసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. కేవలం...

Ap Telangana Borders: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ.. పోలీసుల‌కు కొత్త త‌లనొప్పి
Ap Telangana Borders
Ram Naramaneni
|

Updated on: May 31, 2021 | 11:11 AM

Share

తెలంగాణలో లాక్ డౌన్‌ సడలింపు నిర్ణయంతో.. ఒక్కసారిగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద భారీగా వాహనాల రద్దీ పెరిగింది. కేవలం అంబులెన్స్‌లు, అత్యవసర గూడ్స్‌ వాహనాలకు యధావిధిగా అనుమతి ఇస్తున్నారు పోలీసులు. ఈ -పాస్ ఉన్న వాహనాలను అనుమతిస్తున్నారు. తెలంగాణలోకి వెళ్తున్న ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వివరాలు నమోదు చేసుకుంటున్నారు అధికారులు. ఇక అనుమతి లేని వాహనాలను వెనక్కి పంపుతున్నారు. దీంతో విజయవాడ, హైదరాబాద్‌ హైవేపై భారీ మొత్తం వాహనాలు ఆగిపోయాయి. ఇక ఏపీ బార్డర్‌లో ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాహనాలను అనుమతి ఇస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 తర్వాత ఏపీలోకి రావాలంటే ఈ- పాస్ తప్పనిసరిగా చేసింది జగన్‌ సర్కార్‌. ఈ నేపథ్యంలో సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. దాచేపల్లి మండలం పొందుగల చెక్ పోస్ట్, పంతంగి, కొర్లపహాడ్ టోల్‌ప్లాజా, కృష్ణా, నల్గొండ, హైదరాబాద్-వరంగల్ హైవేపై పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి.

ఇక ఆంధ్ర తెలంగాణ సరిహద్దు కర్నూలు టోల్ ప్లాజా వద్ద కూడా భారీ మొత్తంలో వాహనాలు నిలిచిపోయాయి. కేవలం ఈ పాస్‌ ఉన్న వాహమనలను మాత్రమే అనుమతి ఇస్తున్నారు. అయితే లాక్ డౌన్ సడలింపు సమయంలో కూడా ఆంధ్రా నుంచి తెలంగాణలోకి పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని మండిపడుతున్నారు వాహనదారులు. మధ్యాహ్నం 1గంటల వరకు సడలింపులు ఉన్నప్పటికీ.. ఎందుకనీ, తమని అనుమతించటం లేదని పోలీసులతో వాగ్వాదానికి దిగారు వాహనదారులు.

Also Read:  కరోనాతో రిటైర్డ్ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి.. పూర్తి వివ‌రాలు

తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

Follow Us
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
తెలుగు రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. ఎండలపై తీవ్ర హెచ్చరికలు జారీ
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
వార్నీ.. బొప్పాయి గింజల్లో ఇన్ని రహస్యాలున్నాయా.. ఈ విషయాలు..
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
UPI యూజర్లకు షాక్.. రూ.10,000 పంపితే గంట ఆగాల్సిందేనా? కొత్త రూల్
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
ముల్లన్‌పూర్‌లో ఉత్కంఠ పోరుకు సిద్ధం.. గెలుపు ఎవరిది.?
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
పెరిగిన బంగారం, వెండి ధరలు.. తులం ఎంత ఉందంటే? తాజా అప్‌డేట్!
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
కార్ డ్రైవర్లకు గుడ్ న్యూస్.. కొత్త వాట్సాప్ యాప్ లాంచ్..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
Horoscope Today: వారికి ఆకస్మిక ధన లాభ సూచనలు..
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
మీ పెట్టుబడికి ఏది బెస్ట్? భారీ లాభాలు కురిపించే 'బ్యాంకింగ్' ఏది
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
ట్రంప్ అల్లుడి ఆస్తి ఎంతో తెలుసా? తెలిస్తే అవాక్కవుతారు!
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన
గ్యాస్ కష్టాలకు చెక్.. ఇరాన్ కాల్పుల విరమణ.. కేంద్రం కీలక ప్రకటన