Coronavirus: ఆనందయ్య నాటు మందును వేసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య కన్నుమూత.. పూర్తి వివరాలు
కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందాడు. ఆనందయ్య మందుతో తాను కోలుకున్నట్టు మీడియా ముందు కోటయ్య వెల్లడించిన....
కరోనాతో రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి చెందాడు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం ఆనందయ్య మందుతో తాను కోలుకున్నట్టు మీడియా ముందు కోటయ్య వెల్లడించిన విషయం తెలిసిందే. అప్పట్లో సామాజిక మాధ్యమాల్లో కోటయ్య వీడియోలు వైరల్ అయ్యాయి. ఆనందయ్య మందు తీసుకున్న తర్వాత కూడా కోటయ్య కరోనా నుంచి కోలుకోలేదు. ఈ క్రమంలో పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వారం క్రితం ఆయన్ను నెల్లూరు జీజీహెచ్‌లో చేర్పించారు. కరోనాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోటయ్య మృతి చెందాడు.
అసలేం జరిగిందంటే…
ఆనందయ్య పసరు మందుపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న క్రమంలో.. కోటయ్య ఆరోగ్యమే ప్రధానాంశంగా చర్చ సాగింది. ఆనందయ్య మందు పని చేస్తోందని చెప్పడానికి.. కోటయ్య ఆరోగ్యమే కారణమంటూ చర్చ సాగింది. ఇప్పుడు ఆయన ప్రాణాలు కోల్పోవడంతో.. మరోసారి చర్చనీయ అంశంగా మారింది. ఆనందయ్య మందు వేసుకుని కోలుకున్నానని చెప్పిన కోటయ్య.. అదే కరోనాతో చనిపోయాడు.
కరోనాకు ఆనందయ్య మందు ఇస్తున్నాడని తెలియగానే.. పసరు తీసుకున్నాడు కోటయ్య. ఆ తర్వాత ఆయన చాలా ఆరోగ్యంగా కనిపించారు. ఈ క్రమంలో ఆనందయ్య మందు అసలు పనిచేస్తోందా అని పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న క్రమంలో రిటైర్డ్ హెడ్ మాస్టర్ వాయిస్ కీలకంగా మారింది. అంతకు ముందే ఆనందయ్య పసరు తీసుకున్న కోటయ్య.. ఈ నెల 20న మాట్లాడిన వీడియో ఇప్పుడు మరోసారి వైరల్ అవుతుంది.
అయితే కోటయ్య మాట్లాడిన మరుసటి రోజే.. డీలాపడిపోయారు. సడెన్‌గా ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోవడంతో ఆస్పత్రికి షిఫ్ట్ చేశారు. ఇది ఈ నెల 22 నాటి పరిస్థితి. తీవ్ర అస్వస్థతకు గురైన రిటైర్డ్ హెడ్‌మాస్టార్ పరిస్థితిపై గందరగోళం నెలకొంది. కోటయ్య కంటిని పరీక్షించిన వైద్యులు సమస్యలు గుర్తించారు. టాక్సిక్ కెరటైటిస్ వ్యాధి మొదలైనట్లు తేల్చారు. ఈ నెల 23న నెల్లూరు జిల్లా GGHలో జాయిన్ అయిన కోటయ్య అప్పటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్నారు. చివరకు ఆరోగ్యం విషమించి ప్రాణాలు కోల్పోయారు.
Also Read: తిప్పతీగతో అతడి లక్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు