Vijayawada Flights: ఇకపై విజయవాడ నుంచి నేరుగా సింగపూర్, మస్కట్, కువైట్‌లకు విమానాలు.. రేపు లేదా ఎల్లుండి నుంచి..
Vijayawada Flights: విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఇకపై బెజవాడ నుంచి మస్కట్‌లాంటి దేశాలకు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరలేదు. నేరుగా విజయవాడ నుంచి విదేశాల్లో..
Vijayawada Flights: విజయవాడ నుంచి విదేశాలకు వెళ్లే వారికి గుడ్ న్యూస్.. ఇకపై బెజవాడ నుంచి మస్కట్‌లాంటి దేశాలకు వెళ్లాలంటే చెన్నై లేదా హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరలేదు. నేరుగా విజయవాడ నుంచి విదేశాల్లో వాలిపోవచ్చు. ఈ క్రమంలోనే గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మస్కట్, కువైట్, సింగపూర్‌కు అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇందులో భాగంగానే జూన్ 1,2 తేదీల్లో ఈ సర్వీసుల ప్రారంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ఈ దేశాలకు విమాన సర్వీసులను నడపడానికి ఆసక్తి కనబరుస్తూ. స్లాట్ కోరాయి. దీంతో షెడ్యూల్‌ను ఒకటి లేదా రెండు రోజుల్లో అధికారులు ప్రకటించనున్నారు. ఇదిలా ఉంటే అతర్జాతీయ విమానాలను నడిపే క్రమంలో.. గత నెల రోజులుగా విమానాశ్రయంలోని అంతర్జాతీయ టెర్మినల్‌ను విస్తరిస్తున్నారు. ఈ పనులు దాదాపు పూర్తి కావొచ్చాయి.. ఈ నేపథ్యంలో ఒకేసారి మూడు అంతర్జాతీయ విమానాలు ప్రారంభం కానుండటం విశేషం. గతంలో విజయవాడ నుంచి సింగపూర్‌కు వయబులిటీ గ్యాప్ ఫండ్ (వీజీఎఫ్) విధానంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం నడిపింది. అప్పుడు ఆ సర్వీసుకు 98 శాతం ఆక్యుపెన్సీ సాధించిన విషయం తెలిసిందే.
14 వైద్య కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన.. ఒకేసారి వర్చువల్ విధానంలో శంకుస్థాపన