14 వైద్య కళాశాలలకు సీఎం జగన్ శంకుస్థాపన.. 2023 చివరి నాటికి వీటి నిర్మాణం
CM Jagan to Lay Stone: ఏపీలో నిర్మించనున్న 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో
ఏపీలో నిర్మించనున్న 14 వైద్య కళాశాలలకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నేడు వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్రంలో 16 వైద్య కళాశాలలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఇందులో పులివెందుల, పాడేరులలో ఇప్పటికే పనులు జరుగుతున్నాయి. ఒకేసారి 14 వైద్య కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా శంకుస్థాపన చేయనున్నారు సీఎం. నాడు–నేడుతో వైద్య, ఆరోగ్య రంగంలో పెను మార్పులు తేవడానికి సిద్ధమై మొత్తం 16 మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విజయనగరం, అనకాపల్లి, రాజమహేంద్రవరం, పాలకొల్లు, అమలాపురం, ఏలూరు, మచిలీపట్టణం, బాపట్ల, మార్కాపురం, పిడుగురాళ్ల, మదనపల్లి, పెనుకొండ, ఆదోని, నంద్యాలలో కొత్త కళాశాలలను నిర్మించనున్నారు. ఇందుకోసం మొత్తం రూ. 8 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. 2023 చివరి నాటికి వీటి నిర్మాణం పూర్తికానుందని ప్రభుత్వం తెలిపింది.
ఇప్పటికే పులివెందుల, పాడేరు కాలేజీల పనులు ప్రారంభం అయ్యాయి. అత్యాధునిక వసతులతో వైద్య కళాశాలల నిర్మాణం జరుగుతుంది. ప్రతి వైద్య కళాశాలతో పాటు, నర్సింగ్ కళాశాలలు కూడా ప్రారంబివహం కానున్నాయి.
అంతేకాకుండా.. నర్సింగ్ కళాశాలలను కూడా ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. వీటి ద్వారా 1,850 సీట్లు, 32 విభాగాలకు సంబంధించిన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక, కొత్తగా నిర్మిస్తున్న ప్రతి కళాశాలలో 500 పడకలకు తగ్గకుండా అందుబాటులోకి వస్తాయి. ఇటీవల తలెత్తిన ఆక్సిజన్ సంక్షోభం నేపథ్యంలో నిర్మిస్తున్న ప్రతి ఆసుపత్రిలోనూ ఆక్సిజన్ ట్యాంకులు, ఉత్పత్తి కేంద్రాలను కూడా ఏర్పాటు చేయనున్నారు.