AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. ఇకపై ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీకి చెక్
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ప్రవేట్ ఆస్పత్రులు విచ్చలవిడిగా దోపిడీకి తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే....
కరోనా లాంటి విపత్కర పరిస్థితులను అనుకూలంగా మార్చుకుని ప్రవేట్ ఆస్పత్రులు విచ్చలవిడిగా దోపిడీకి తెగబడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఇటువంటి ఘటనలు అనేకం నమోదైన విషయం తెలిసిందే. ఈ విషయంపై అఖిక భారత న్యాయవాదుల సంఘం దాఖలు చేసిన పిల్ పై ఏపీ హైకోర్టు ఆదేశాలు కీలక ఆదేశాలు ఇచ్చింది. హైకోర్టు ఆదేశాలతో కోవిడ్ నోడల్ ఆఫీసర్ విధులు నిర్దారించింది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. రోగుల నగదు చెల్లింపులు నోడల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో జరగాలని హైకోర్టు సూచించింది. రోగులకు బిల్లులు ఇచ్చే ముందుగా నోడల్ ఆఫీసర్ సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం బిల్లులు ఇచ్చారా లేదా పరిశీలించాలని పేర్కొంది. నోడల్ అధికారి సంతకం లేకుండా కోవిడ్ ఆసుపత్రులు నగదు తీసుకోకూడదని హైకోర్టు తేల్చి చెప్పింది. ప్రతి కోవిడ్ ఆసుపత్రిలో చికిత్స నగదుకు సంబంధించి డిస్ ప్లే బోర్డ్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. హైకోర్టు ఆదేశాలు అమలు జరిగిలా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఎంహెచ్ఓలను హైకోర్టు ఆదేశించింది.
ఏపీ కరోనా వివరాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1,91,72,843 శాంపిల్స్ పరీక్షించగా 16,85,142 మంది కరోనా బారిన పడ్డారు. వీరిలో 15,08,515 మంది కరోనాను జయించి పూర్తి ఆరోగ్యంగా కోలుకున్నారు. కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రంలో 10,832 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,65,795 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. కరోనా కట్టడి చర్యల్లో భాగంగా రాష్ట్రంలో మధ్యాహ్నం 11 గంటల నుంచి తెల్లారి ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్ డౌన్ కొనసాగుతుంది.
Also Read: తిప్పతీగతో అతడి లక్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు