AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: పెళ్లిపీట‌ల‌పై వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు.. శ‌వం ఇంట్లోని గ‌దిలో

ఆ ఇంట్లో పెళ్లి కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రుగుతుంది. బంధువులు, హితుల‌తో పెళ్లి మండ‌పం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. పెళ్లి తంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు..

Viral News: పెళ్లిపీట‌ల‌పై వధువు మృతి.. ఆమె సోదరిని పెళ్లాడిన వరుడు.. శ‌వం ఇంట్లోని గ‌దిలో
Marriage Viral
Ram Naramaneni
|

Updated on: May 31, 2021 | 2:12 PM

Share

ఆ ఇంట్లో పెళ్లి కార్య‌క్ర‌మం వైభ‌వంగా జ‌రుగుతుంది. బంధువులు, హితుల‌తో పెళ్లి మండ‌పం క‌ళ‌క‌ళ‌లాడుతుంది. పెళ్లి తంతులో భాగంగా వధువు.. వరుడు పూలదండలు మార్చుకున్నారు. ఆ వెంటనే వధువు ఒక్క‌సారిగా కుప్పకూలిపోయింది. ఏం జ‌రిగిందో అర్థం కాక‌ముందే ఆమె ప్రాణాలు విడిచింది. కాగా, ఈ వివాహం ఆగకూడదని పెళ్లి పెద్దలు వరుడికి మృతురాలి సోదరిని ఇచ్చి వివాహం జరిపించారు. ఈ ఘటన ఉత్తర్​ ప్రదేశ్​లో జరిగింది.

అస‌లేం జ‌రిగిందంటే…

ఉత్తర్​ప్రదేశ్ ఇటావా జిల్లా సనద్‌పూర్‌లో సురభి అనే యువతికి మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తితో పెళ్లి నిశ్చ‌యించారు పెద్ద‌లు. ఈ నేపథ్యంలోనే కుటుంబసభ్యులు వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు.పెళ్లికుమార్తె, పెళ్లికుమారుడు మండ‌పానికి చేరుకున్నారు. పెళ్లి తంతు ప్రారంభ‌మైంది. కానీ, పూలదండలు మార్చుకున్న తర్వాత వధువు సురభి పెళ్లిపీటలమీదే అక‌స్మాత్తుగా కూలిపోయింది. అల‌స‌ట‌తో క‌ళ్లుతిరిగి ప‌డిపోయింద‌ని భావించిన‌ కుటుంబసభ్యులు డాక్ట‌ర్‌ను అక్క‌డికి పిలిపించారు. వైద్యుడు ఆమెను పరీక్షించి గుండెపోటుతో చ‌నిపోయినట్లు చెప్పాడు. ఈ పరిణామంతో వివాహవేడుకలో విషాదం అలుముకుంది. అయితే, పెళ్లికి వచ్చిన బంధువులు, చేసిన ఖర్చు దృష్ట్యా పెళ్లి ఆగిపోకూడదని భావించిన ఇరు కుటుంబాలు.. వధువు సోదరిని మనోజ్‌కి ఇచ్చి వివాహం చేయాలని నిర్ణయించాయి. దీంతో వధువు మృతదేహాన్ని ఒక గదిలో ఉంచి.. ఆమె సోదరితో పెళ్లి జరిపించారు.పెళ్లి మధ్యలో సోదరి మృతి చెందడంతో ఏం చేయాలో అర్థం కాలేదని, పెద్దల సూచనల మేరకు మరో సోదరిని వరుడికి ఇచ్చి వివాహం జరిపించామని సురభి సోదరుడు వాపోయాడు.

Bride Died

Bride Died

Also Read: తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్

Follow Us
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
గర్భగుడిలో లింగం, నందీ లేదు.. ధ్వజస్తంభమూ లేదు.. అయినా భక్తులతో..
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
బీటెక్‌లో నేరుగా రెండో సంవత్సరంలో చేరాలనుకుంటున్నారా?
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
ఈ పదేళ్లలో ఆ టాలీవుడ్ హీరో ఎదిగిన తీరు అద్భుతం: వడ్డే నవీన్
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
మసి పొరల మాటు దాగిన మర్మం.. బయటపడ్డ వేల ఏళ్ల కళా వైభవం!
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
వంట చేసేప్పుడు ఈ చిట్కాలు పాటస్తే చాలు..గ్యాస్ ఈజీగా ఆదా చేయొచ్చు
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
Asian Games 2026: ఈ ముగ్గురు పాక్ ప్లేయర్లతో టీమిండియా జాగ్రత్త
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
అప్పట్లో తోపు హీరో.. కట్ చేస్తే.. తెలుగులో పాపులర్ కమెడియన్..
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
కాకినాడలో eRZL హైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ అవగాహన కార్యక్రమం
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ! బీజేపీ ఎంపీల ఏకగ్రీవం!
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు
చిరంజీవి 'విశ్వంభర'కు విజువల్ ఎఫెక్ట్స్ తలనొప్పులు