Croaker Fish: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్

క్రోక‌ర్ చేప‌.. దీన్ని ఎప్పుడైనా చూశారా.. క‌నీసం పేరు అయినా విన్నారా.. లేదు క‌దా.. ప‌దండి ఈ కాస్ట్లీ చేప గురించి ఇప్ప‌డు మీకు కొన్ని వివ‌రాలు చెబుతాం.

Croaker Fish: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్
Croker Fish
Follow us
Ram Naramaneni

|

Updated on: May 31, 2021 | 10:22 AM

క్రోక‌ర్ చేప‌.. దీన్ని ఎప్పుడైనా చూశారా.. క‌నీసం పేరు అయినా విన్నారా.. లేదు క‌దా.. ప‌దండి ఈ కాస్ట్లీ చేప గురించి ఇప్ప‌డు మీకు కొన్ని వివ‌రాలు చెబుతాం. పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్ సముద్ర తీరంలో చేపలు పడుతున్న గ్వాదర్ జిల్లా మత్స్యకారులు అబ్దుల్ హక్, అత‌డి సహచరులు వేసిన‌ తమ వలలో తాజాగా ఈ క్రోకర్ చేప చిక్కింది. దీంతో వారు సంబ‌రాల్లో మునిగిపోయారు. బరువు, పొడవు కూడా మ‌రీ చెప్పుకోద‌గినంత లేదు… ఇంత‌కూ సంబ‌రాలు ఎందుకంటారా.. అక్క‌డికే వ‌స్తున్నాం. ఈ చేప చాలా కాస్ట్లీ. అందుకే స‌ద‌రు మ‌త్య‌కారులు ఆ చేప దొర‌క్కానే తీస్కుని మార్కెట్‌కు ల‌గెత్తారు. 26 కిలోల బరువున్న ఆ క్రోకర్ చేప ధర ఏకంగా 7 లక్షల 80 వేలు ప‌లికింది. ఈ చేపను దొరకగానే త‌మ ఇంట‌ పండగ మొద‌లైంద‌ని మ‌త్స‌కారులు చెబుతున్నారు.

క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్ వల్లే అది అంత ధర పలుకుతుందని గ్వాదర్ డెవలప్‌మెంట్ అథారిటీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్విరాన్‌మెంట్, సీనియర్ జువాలజిస్ట్ అబ్దుల్ రహీమ్ బలోచ్ చెప్పారు. ఎయిర్ బ్లాడర్ లో అది గాలి నింపుకుని ఈదుతుందట‌. ఈ చేప ఎయిర్ బ్లాడర్ వైద్య చికిత్సల్లో ఉపయోగపడుతుండడంతో చైనా, జపాన్, యూరప్‌లో దానికి చాలా డిమాండ్ ఉందని ఆయ‌న చెప్పారు. మనుషులకు సర్జరీ చేసినప్పుడు శరీరం లోపలే వేసే కుట్ల కోసం క్రోకర్ చేప ఎయిర్ బ్లాడర్‌తో కుట్లు వేసే దారం తయారు చేస్తారని వివ‌రించారు. ముఖ్యంగా గుండె ఆపరేషన్ సమయంలో దానితో తయారు చేసిన దారంతో కుట్లు వేస్తారని, అవి తర్వాత శరీరంలో కలిసిపోతాయని రహీమ్ బలోచ్ తెలిపారు. అన్న‌ట్లు ఈ చేప కుర్, కుర్ మనే శబ్దం వ‌ల్లే దానికి క్రోక‌ర్ అని పేరు వ‌చ్చింద‌ట‌.

Also Read: తిప్ప‌తీగ‌తో అత‌డి ల‌క్ తిరిగింది.. ఇప్పుడు ఏకంగా కోట్లు సంపాదిస్తున్నాడు

 ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. ఇక‌పై ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్