Private Hospital Corona: రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృతదేహం ఇస్తాం.. ఎల్బీన‌గ‌ర్ మ్యాక్స్ క్యూర్‌లో ఘ‌ట‌న‌..

Private Hospital Corona: క‌రోనా క‌ష్ట కాలాన్ని కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. క‌రోనాతో ఆసుప‌త్రిలో చేరిన రోగుల నుంచి రూ. ల‌క్ష‌ల్లో ఫీజులు వ‌సూళు చేస్తున్నాయి. కొన్ని ఆసుప‌త్రులైతే...

Private Hospital Corona: రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృతదేహం ఇస్తాం.. ఎల్బీన‌గ‌ర్ మ్యాక్స్ క్యూర్‌లో ఘ‌ట‌న‌..
Corona Patient Died
Follow us
Narender Vaitla

|

Updated on: May 31, 2021 | 10:47 AM

Private Hospital Corona: క‌రోనా క‌ష్ట కాలాన్ని కొన్ని ప్రైవేటు ఆసుప‌త్రులు వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. క‌రోనాతో ఆసుప‌త్రిలో చేరిన రోగుల నుంచి రూ. ల‌క్ష‌ల్లో ఫీజులు వ‌సూళు చేస్తున్నాయి. కొన్ని ఆసుప‌త్రులైతే రోజుకు ఏకంగా రూ. ల‌క్ష‌న్న‌ర వ‌ర‌కు వ‌సూళు చేసిన సంఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయి. ఈ క్ర‌మంలోనే తాజాగా హైద‌రాబాద్ బంజారాహిల్స్‌లోని ఓ ఆసుప‌త్రిలో రోగి మ‌ర‌ణం తీవ్ర చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. ఆసుప‌త్రి యాజ‌మాన్యం రూ. ల‌క్ష‌ల్లో ఫీజు వ‌సూళు చేసి మృత‌దేహాన్ని అందించారంటూ రోగి త‌ర‌ఫు బంధువులు నిర‌స‌న‌కు దిగారు. ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నానికి తెర తీసింది. దీంతో ప్ర‌భుత్వం రాష్ట్రంలోని కొన్ని ఆసుప‌త్రులపై కొర‌డా జులిపించింది. అయితే ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్నా ఆసుత్రుల వ్య‌వ‌హార శైలిలో మాత్రం మార్పు రావ‌డం లేదు. తాజాగా ఎల్బీన‌గ‌ర్ బీఎన్ రెడ్డి వ‌న‌స్థ‌లిపురం పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలోని మ్యాక్స్ క్యూర్ ఆసుప‌త్రిలో దారుణం చోటుచేసుకుంది. స‌మంత రెడ్డి (28) అనే మ‌హిళ క‌రోనా బారిన‌ప‌డి మ్యాక్స్ క్యూర్‌లో చేరారు. కొన్ని రోజులు చికిత్స పొందిన స‌మంత‌.. క‌రోనా మృతితో చెందారు. దీంతో ఆసుప‌త్రి యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కారణంగానే స‌మంత మృతి చెందారాని ఆమె కుటుంబ స‌భ్యులు ధ‌ర్నా చేశారు. బ్యాలెన్స్ ఫీజు రూ. రెండు ల‌క్ష‌లు క‌డితేనే మృత‌దేహాన్ని తేల్చిచెప్పింది. ఇప్ప‌టికే రూ. 8 ల‌క్ష‌లు చెల్లించామ‌ని ఇక‌పై డ‌బ్బులు క‌ట్ట‌డం మాతో కాద‌ని.. రోగి బంధువులు ఆరోపించారు. గొడ‌వ పెద్ద‌ది కావ‌డంతో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ బాబు జోక్యం చేసుకున్నారు. దీంతో స‌మంత మృత‌దేహాన్ని ఆసుప‌త్రి యాజ‌మాన్యం కుటుంబ‌స‌భ్యుల‌కు అప్ప‌గించింది. ఇదిలా ఉంటే.. స‌మంత రెడ్డికి 4 ఏళ్ల పాప‌, ఏడాదిన్నర బాబు ఉన్నారు. ఆమె మ‌ర‌ణంతో ఇద్ద‌రి చిన్నారులు తల్లి లేని వార‌య్యారు. ఈ సంఘ‌ట‌న‌తో స్థానికంగా తీవ్ర విచారం నెల‌కొంది.

Also Read: Coronavirus: కరోనాతో రిటైర్డ్ హెడ్‌ మాస్టర్‌ కోటయ్య మృతి.. పూర్తి వివ‌రాలు

Croaker Fish: ఒక్క చేప‌తో వారి సుడి మారిపోయింది.. ఎంత‌కు అమ్మారో తెలిస్తే మైండ్ బ్లాంక్

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు.. ఇక‌పై ప్రైవేట్ ఆస్ప‌త్రుల దోపిడీకి చెక్