Anti-Viral Natural Foods: కరోనా కాలంలో వీటిని ఆహారంలో భాగం చేసుకోవాల్సిందే.. వైరల్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్ పెడుతూనే..
Anti-Viral Natural Foods: కరోనా సమయంలో కాస్త జలుబు చేసినా.. దగ్గు వచ్చినా కరోనానేమో అనే భయం అందరిలోనూ కలుగుతోంది. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు వైరస్, ఫంగస్, బ్యక్టీరియాల...
Anti-Viral Natural Foods: కరోనా సమయంలో కాస్త జలుబు చేసినా.. దగ్గు వచ్చినా కరోనానేమో అనే భయం అందరిలోనూ కలుగుతోంది. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులు వైరస్, ఫంగస్, బ్యక్టీరియాల వల్ల సోకుతాయనే విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ సమయంలో వైరస్‌ను బాడీలోకి రాకుండా చేసుకోవడం ఎంతో అవసరం. ఈ క్రమంలోనే వైరస్‌ను తరమికొడుతూనే శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచే కొన్ని ఆహారపదార్థలున్నాయి. అలాంటి కొన్ని సహజ ఆహార పదార్థాలపై ఓ లుక్కేయండి..
తులసి ఆకులు..
భారతదేశలంలో దాదాపు అందరి ఇళ్లలో కచ్చితంగా ఉండే మొక్కల్లో తులసి ఒకటి. ఇందులో ఎన్నో ఔషధగుణాలున్నాయి. ఇవి శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ముఖ్యంగా ప్రతి రోజూ తులసి ఆకులను నమలడం ద్వారా రోగనిరోధశక్తి పెరుగుతుంది. అంతేకాకుండా ఇందులో ఉంగే యాంటీ వైరల్, యాంటీ ఇన్‌ఫ్లామెటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు శరీరంలోకి ఇన్‌ఫెక్షన్లతో పోరాడుతాయి.
సోంపు గింజలు..
ఆహారం తీసుకోగానే సోంపు వేసుకునే అలవాటు మనలో చాలా మందికి ఉంటుంది. జీర్ణవ్యవస్థ మెరుగుపరడంలో సోంపు గింజలు కీలక పాత్ర పోషిస్తాయనే విషయం మనందరికీ తెలిసిందే. అయితే రోగనిరోధక శక్తి పెరగడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది.
వెల్లుల్లి..
వెల్లుల్లి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనందరికీ తెలిసిందే. పరిశోధనల్లో తేలిన అంశాల ప్రకారం.. వెల్లుల్లి ఇన్‌ఫ్లూయేంజా ఏ,బీలతో పాటు.. హెచ్ఐవీ, హెచ్ఎస్‌వీ-1 వంటి వాటిపై క్రీయాశీలకంగా పనిచేస్తుందని తేలింది. వెల్లుల్లిలో ఉండే ఆల్కిన్ అనే కంపౌండ్ కారణంగానే వీటికి ప్రత్యేక వాసన గుణాన్ని ఇస్తుంది. ఇది శరీరంలో ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తుంది.
అల్లం..
అల్లంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లేమంటరీ లక్షణాలు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో వైరస్ ఉధృతిని తగ్గించడంలో అల్లం కీలక పాత్ర పోష్టిస్తుంది. అల్లం ఛాయ్ వల్ల గొంతు సమస్యలతో పాటు తలనొప్పి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.