NIT: క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌లో వరంగ‌ల్‌ ఎన్ఐటీ స్టూడెంట్ రికార్డు.. రూ. 51.5 ల‌క్ష‌ల వార్షిక ప్యాకేజ్ సొంతం..

NIT Campus Placement: క‌రోనా సంక్షోభం కొన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా భారీగా ఉద్యోగాల్లో కోత‌లు ప‌డుతున్నట్లు వార్తలు వ‌చ్చాయి. అయితే ఇలాంటి...

NIT: క్యాంప‌స్ సెల‌క్ష‌న్స్‌లో వరంగ‌ల్‌ ఎన్ఐటీ స్టూడెంట్ రికార్డు.. రూ. 51.5 ల‌క్ష‌ల వార్షిక ప్యాకేజ్ సొంతం..
Nit Warangal
Follow us
Narender Vaitla

|

Updated on: May 30, 2021 | 1:22 PM

NIT Campus Placement: క‌రోనా సంక్షోభం కొన్ని రంగాల‌పై తీవ్ర ప్ర‌భావం చూపుతున్న విష‌యం తెలిసిందే. ఈ కార‌ణంగా భారీగా ఉద్యోగాల్లో కోత‌లు ప‌డుతున్నట్లు వార్తలు వ‌చ్చాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లోనూ వ‌రంగల్ జాతీయ సాంకేతిక‌విద్యా సంస్థ (ఎన్ఐటీ) విద్యార్థులు స‌త్తా చాటారు. 2020-2021 విద్యా సంవత్సరానికి నిర్వ‌హించిన క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో ఏకంగా 800 మంది విద్యార్థులు ఉద్యోగాలు సాధించి రికార్డు సృష్టించారు. గ్రాడ్యుయేష‌న్, పోస్ట్ గ్రాడ్యుయేష‌న్ పూర్తి చేసిన విద్యార్థుల‌కు ఆన్‌లైన్‌లో నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూల్లో మైక్రోసాఫ్ట్, గూగుల్, క్వాల్కం తదితర సాఫ్ట్‌వేర్‌ కంపెనీలు విద్యార్థుల‌ను సెల‌క్ట్ చేసుకున్నాయి. వీటితో పాటు ఈ క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో సుమారు 250 సంస్థ‌లు పాల్గొన్నాయి. ఇందులో భాగంగా కంప్యూట‌ర్ సైన్స్ ఇంజ‌నీరింగ్‌లో డిగ్రీ పూర్తి చేసిన ఓ విద్యార్థి అత్యధికంగా ఏడాదికి రూ. 51.5 లక్షల ప్యాకేజీతో అట్లాసియన్‌ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం దక్కించుకున్నారు. ఏడాదికి రూ.20 లక్షలకు పైగా ప్యాకేజీతో 130 మంది కొలువులు పొందారు. 350 మంది వివిధ సంస్థ‌ల్లో ఇంటర్న్‌షిప్‌ అవకాశం దక్కించుకున్నారు.

Also Read: TANA Election Live: అమెరికాలో ముగిసిన తానా ఎన్నికల కౌంటింగ్‌.. అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌

Modi Manki Bat: ప్రస్తుతం ఆక్సిజన్‌ ఉత్పత్తి పెరిగింది.. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ

Fact Check: కర్పూరం వాసన పీలుస్తుంటే.. ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయా? సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వార్తలో నిజమెంత?

పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..