‘మెడికల్ మాఫియా’ పై బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ మీద కేసు పెడతారా ..?? బాబా రాందేవ్ బాబా సవాల్
అల్లోపతి మందులు, డాక్టర్లపై యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి మధ్య డైరెక్ట్ 'వార్' జరుగుతోంది.
అల్లోపతి మందులు, డాక్టర్లపై యోగాగురు బాబా రాందేవ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు.. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కి మధ్య డైరెక్ట్ ‘వార్’ జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాందేవ్ ఈ సంస్థకు ఓ సవాల్ విసిరారు. 2012 లో బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ నిర్వహించిన ‘సత్యమేవ్ జయతే’ టాక్ షో తాలూకు ఓ వీడియోను రామ్ దేవ్ హైలైట్ చేస్తూ.. దేశంలో మెడికల్ మాఫియా ఎప్పటినుంచో వేళ్ళూనుకున్నదని, దీనిపై ఆమిర్ ఖాన్ మీద కేసు పెట్టగలుగుతారా,, మీరు ప్రొటెస్ట్ చేయగలుగుతారా అని ప్రశ్నించారు.మందుల అత్యధిక ధరలపై ఆ నటుడ్ని ఇప్పుడు నిలదీయగలుగుతారా అని సవాల్ విసిరారు. నాటి ఆ టాక్ షో సందర్భంగా సమీర్ శర్మ అనే వ్యక్తి దేశంలో లభిస్తున్న మందుల అత్యధిక ధరలను ప్రస్తావించాడు. ఉత్పత్తి అవుతున్న ఔషధాల ధరలు తక్కువే ఉన్నా మార్కెట్లో 10 నుంచి 15 శాతం ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారని, 40 కోట్ల మందికి పైగా ప్రజలు రెండు పూటలా కడుపు నిండా ఆహారం తినలేకపోతున్నారని, వారు ఇంత ధరలు పెట్టి మందులను కొనగల్గుతారా అని ఆయన ప్రశ్నించాడు. ఉదాహరణకు బ్లడ్ క్యాన్సర్ పాకెట్ మందు మార్కెట్లో లక్షా 25 వేలరూపాయలయితే జెనెరిక్ స్టోర్లలో 10 వేలకు లభిస్తోందని ఆయన చెప్పారు. ఇలా ఇంకా సమిత్ శర్మ ఇంకా ఏదో మాట్లాడబోతుండగా …ఆమిర్ ఖాన్ జోక్యం చేసుకుని మెడిసిన్స్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నందున సామాన్యులు వాటిని కొనలేకపోతున్నారని అన్నారు.
ఈ సంభాషణను రామ్ దేవ్ బాబా తన ట్విటర్ కు జోడించారు. మీకు దమ్ముంటే అమిర్ ఖాన్ మీద కేసు పెట్టండి అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ని ఉద్దేశించి వ్యాఖ్యానించారు., కాగా రాందేవ్ బాబా 15 రోజుల్లోగా లిఖితపూర్వక క్షమాపణ చెప్పాలని లేని పక్షంలో ఆయనపై వెయ్యి కోట్ల దావా వేస్తామని, ఉత్తరాఖండ్ ఐఎంఏ నోటీసు పంపగా.. ఢిల్లీలోని ఈ సంస్థ ఆయనపై చర్య తీసుకోవాలని కోరుతూ ప్రధాని మోదీకి లేఖ రాసింది. అయితే తనను అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదని రామ్ దేవ్ బాబా ఛాలెంజ్ విసిరారు.
మరిన్ని ఇక్కడ చూడండి: CM Jagan: అందరికీ మంచి చేశానన్న నమ్మకం ఉంది.. రెండేళ్ల పాలనపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వ్యాఖ్య..
America TANA: అమెరికా ‘తానా’ ఎన్నికల్లో సత్తా చాటిన శృంగవరపు నిరంజన్.. సంబరాల్లో ప్యానెల్