America TANA: అమెరికా ‘తానా’ ఎన్నికల్లో సత్తా చాటిన శృంగవరపు నిరంజన్.. సంబరాల్లో ప్యానెల్
America TANA Election: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు.
America TANA Election: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి. తానా ఎన్నికల్లో గెలుపొందడంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు చేసుకుంటోంది.
కొడాలి ఓడాలి అంటూ కాళ్లరిగేలా అమెరికా అంతటా చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది. తానాలో సమూల మార్పులు తీసుకురాగల శక్తి ఉందని రుజువైంది. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉండగా, పోలైన ఓట్లు 21 వేలు ఉన్నాయి. ఇక ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లు గుర్తించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ అయితే ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్, నరేన్ కొడాలి ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
ఇవీ కూడా చదవండి: