Wuhan Virus: మళ్ళీ మొదటికొచ్చిన ‘వూహాన్ వైరస్’ వ్యవహారం…అది చైనాలోని వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందే ! వైరస్ లో ‘ఫింగర్ ప్రింట్స్’ చూశామంటున్న బ్రిటిష్..

కోవిద్-19 వైరస్ సహజంగా పుట్టింది కాదని, అది చైనా శాస్త్రజ్ఞులు వూహాన్ ల్యాబ్ లో సృష్టించినదేనని బ్రిటిష్, నార్వే దేశాలకు చెందిన ఇద్దరు రీసెర్చర్లు ప్రకటించారు.

Wuhan Virus: మళ్ళీ మొదటికొచ్చిన 'వూహాన్ వైరస్' వ్యవహారం...అది చైనాలోని వైరాలజీ ల్యాబ్ లో పుట్టిందే ! వైరస్ లో 'ఫింగర్ ప్రింట్స్' చూశామంటున్న బ్రిటిష్..
Covid 19
Follow us

| Edited By: Phani CH

Updated on: May 30, 2021 | 1:28 PM

Wuhan Virus: కోవిద్-19 వైరస్ సహజంగా పుట్టింది కాదని, అది చైనా శాస్త్రజ్ఞులు వూహాన్ ల్యాబ్ లో సృష్టించినదేనని బ్రిటిష్, నార్వే దేశాలకు చెందిన ఇద్దరు రీసెర్చర్లు ప్రకటించారు. చైనావారు ఈ వైరస్ సహజంగా పుట్టిందని చూపడానికి దీని విషయంలో వక్ర భాష్యాలు చెప్పి తమను తాము కవరప్ చేసుకోవడానికి ప్రయత్నించారని బ్రిటిష్ శాస్త్రజ్ఞుడు యాంగస్ డల్ గీష్, నార్వే రీసెర్చర్ డా. బిర్గెర్ సొరెన్ సెన్ తమ అధ్యయన పత్రంలో ఆరోపించారు. చైనాలోని వూహాన్ ల్యాబ్ లో దీన్ని సృష్టించారనడానికి తమ వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయని వారు పేర్కొన్నారు. డ్రాగన్ కంట్రీ కావాలనే ఈ విషయాన్ని దాచి పెడుతోందని, డేటాను ఎవరికీ షేర్ చేయడం లేదని, పైగా తమ రీసెర్చర్ల నోళ్లు మూయించిందని వీరు తెలిపారు. తాము గత ఏడాది వ్యాక్సిన్ ని తయారు చేయడానికి అనువుగా పరిశోధనలు చేస్తుండగా కోవిద్-19 శాంపిల్స్ ని ఎనలైజ్ చేస్తున్నప్పుడు వైరస్ లో అసాధారణ ‘ఫింగర్ ప్రింట్స్’ ను కనుగొన్నామని వారు వెల్లడించారు. అసలు వైరస్ లో ఇవి ఎలా వచ్చాయని ఈ రీసెర్చర్లు ప్రశ్నించారు. చైనా శాస్త్రజ్ఞులు గబ్బిలాల్లోని సహజసిధమైన వైరస్ ని కనుగొన్నారని, దానికి కొత్త స్ట్రైక్ ప్రోటీన్ ని కలిపారని, దాంతో ప్రమాదకరమైన..డెడ్లీ సార్స్-కొవ్-2 ఏర్పడిందని వీరు విశ్లేషించారు. 2002 లో సార్స్-1 వైరస్ ను గబ్బిలాల్లో కనుగొన్నారు.. ఆ తరువాత అది పునుగుపిల్లికి వ్యాపించింది అని ఈ రీసెర్చర్లు పేర్కొన్నారు.

అయితే ఈ అధ్యయనంతో పలువురు రీసెర్చర్లు విభేదించారు. చైనా ఇప్పటికే దీన్ని ఖండించిన విషయాన్ని వారు గుర్తు చేశారు. మీరు కనుగొన్న ఆధారాలను ప్రపంచానికి చూపాలని కోరారు. ఈ వైరస్ గబ్బిలాలు లేదా ఇతర జంతువుల నుంచి మనుషులకు వ్యాపించి ఉండవచ్చునన్నారు. అమెరికా లోని ప్రముఖ వైరాలజిస్ట్ కూడా మొదట ఈ వైరస్ విషయమై ఇన్వెస్టిగేషన్ జరగాలని, అప్పుడే ఓ నిర్ధారణకు రాగలుగుతామని చెప్పారు. అటు అధ్యక్షుడు జోబైడెన్ 90 రోజుల్లోగా ఇందుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ పూర్తి చేయాలనీ ఆదేశించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Etela Jamuna: “అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తెలుసు.. ఎన్నికుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డం”

తనపై అరెస్టు విషయంలో ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలంటూ కేసీఆర్‌కు లేఖ రాసిన రఘురామ కృష్ణంరాజు