AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌… రక్తం విషపూరితం.. మృతి

దేశం ఓవైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త ఫంగస్‌లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా....

Coronavirus:  ఒకే వ్యక్తిలో బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌... రక్తం విషపూరితం.. మృతి
Death
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 1:23 PM

Share

దేశం ఓవైపు కరోనాతో అల్లాడిపోతుంటే.. ఇప్పుడు వెలుగులోకి వస్తున్న కొత్త కొత్త ఫంగస్‌లు జనానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రోగులు ఫంగస్‌ల బారినపడి మరణిస్తున్న ఘటనలు అధికమవుతున్నాయి. ఇటీవల కరోనా పాజిటివ్‌గా తేలిన వ్యక్తికి మూడు ఫంగస్‌లు సోకి ప్రాణాలు కోల్పోయిన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని గాజియాబాద్‌లో చోటుచేసుకుంది. స్థానిక సంజయ్‌నగర్‌ ప్రాంతానికి చెందిన 59 ఏళ్ల కున్వర్‌ సింగ్‌ అనే లాయర్‌ కరోనా బారిన పడటంతో చికిత్స నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేరారు. మే 24న ఆయనకు ఎండోస్కోపీ చేయగా.. బ్లాక్‌ ఫంగస్‌, వైట్‌ ఫంగస్‌తో పాటు ఎల్లో ఫంగస్‌ను కూడా గుర్తించినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎంత ప్రయత్నించినా వైద్యులు చేసిన చికిత్స ఫలించలేదు. ఫంగస్ ల కారణంగా శరీరంలోని రక్తం విషపూరితంగా మారడంతో చికిత్స పొందుతూనే కున్వార్‌ సింగ్‌ ప్రాణాలు కోల్పోయాడు.

కాగా.. ఇదే ఆసుపత్రిలో మురాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మరో 59 ఏళ్ల వ్యక్తి రాజేశ్‌ కుమార్‌కు ఎల్లో ఫంగస్‌ సోకినట్లు వైద్యులు గుర్తించారు. అతడి మెదడు సమీపంలో ఈ ఫంగస్‌ ఉందని, ఇప్పటికే ఆయన దవడలో సగభాగం తీసేసినట్లు వెల్ల‌డించారు. ప్రస్తుతం రాజేశ్ కుమార్‌ కోలుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల కరోనా బాధితుల్లో ఫంగస్‌ లక్షణాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ సంఖ్య‌లో (12వేల పైచిలుకు) బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. అక్కడక్కడా వైట్‌ ఫంగస్‌, ఎల్లో ఫంగస్‌ కేసులు కూడా వెలుగుచూస్తున్నాయి.

Also Read: పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..

ముదిరిన పైత్యం.. ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌… తిక్క కుద‌ర్చిన పోలీసులు

Follow Us
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
ఓపిక ఉన్నవాడిదే లోకం.. తనయులకు తండ్రి నేర్పని గొప్ప పాఠం..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
యూరప్‌లో కొత్త మిత్రుడి కోసం భారత్ వేట.. కారణం ఇదే..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
స్క్వాడ్‌లోనే లేడు.. కట్‌చేస్తే.. టాస్ టైంకి ప్లేయింగ్ 11లోకి..!
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
బ్యాచిలర్స్ ఫేవరెట్ రెసిపీ.. చపాతీ, రైస్ రెండింటికీ ఇదే పర్ఫెక్ట్
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యపై తుపాకీతో కాల్పులు..!
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
ఆటలో కోహ్లీని మించిన తోపు.. సెలెక్టర్ల దృష్టిలో పనికిరానోడు
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
10 గ్రాముల బంగారు గొలుసుపై లోన్‌ తీసుకుంటే ఎంత డబ్బు వస్తుంది?
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
నిద్రలో ఉన్న భార్యను కాల్చి చంపేందుకు భర్త యత్నం..!
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
మహిళల కోసం ట్రిప్స్.. ఎందుకో చెప్పిన కమల్ హాసన్ మేనకోడలు
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా
పవన్ కల్యాణ్‌ను కలిసిన అల్లు అర్జున్! ఆరోగ్య పరిస్థితిపై ఆరా