AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Crime News: ముదిరిన పైత్యం.. ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌… తిక్క కుద‌ర్చిన పోలీసులు

ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌ చేసి పోలీసు కేసుల పాలైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కదా ఇంట్లో ఉండి బోరుకొట్టినట్టుంది....

Crime News: ముదిరిన పైత్యం.. ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌... తిక్క కుద‌ర్చిన పోలీసులు
Hanging Tik Tok
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 12:57 PM

Share

ఉరి వేసుకునే సీన్‌తో టిక్‌టాక్‌ చేసి పోలీసు కేసుల పాలైన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. లాక్ డౌన్ కదా ఇంట్లో ఉండి బోరుకొట్టినట్టుంది ఆ స్నేహితులకు. ఆలా బయటికి వెళ్లి ఏదైనా చేద్దామనుకున్నారు. చివరికి టిక్‌టాక్‌ చేద్దామని అలా బయటకు వెళ్లారు. ఆలాంటి ఇలాంటి ఆలోచన రాలేదు వారికి. చెట్టుకు ఉరి వేసుకుని అందరినీ భయపెడుదామనుకున్నారు. ఇంకేముంది తమ ఐడియాను వర్కవుట్‌ చేసేందుకు అవసరమైన సరంజామాను సిద్ధం చేసుకుని బయటికి వెళ్లారు. ఓ మంచి ప్లేస్‌ చూసుకుని చెట్టుకు ఉరివేసుకునే యాక్షన్‌తో టిక్‌టాక్‌ చేశారు. ఫోన్లో ఉరివేసుకొనే సన్నివేశం చిత్రీకరించుకున్నారు.. ఆ వీడియో కాస్తా వైరల్ గా మారడంతో అందులో ఒకరిపై కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం అప్పారెడ్డి గూడెం గ్రామానికి చెందిన జగన్, శ్రీను ఇద్దరు మిత్రులు. లాక్ డౌన్ కారణంగా ఇద్దరూ కలిసి సరదాగా చెట్టుకు ఉరివేసుకునే టిక్ టాక్ వీడియో చిత్రీకరించారు.

అది కాస్తా వైరల్ గా మారి జగన్ తల్లిదండ్రులకు తెలియడంతో వారు వీడియో చిత్రీకరించిన శ్రీనుపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న నందిగామ పోలీసులు కేసు నమోదు చేశారు. సరదాకు కూడా ఇలాంటి వీడియోలు చేసి ఇబ్బందుల పాలు కావద్దని హెచ్చరించారు పోలీసులు.

Also Read: “అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తెలుసు.. ఎన్నికుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డం”

పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..