AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Etela Jamuna: “అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తెలుసు.. ఎన్నికుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డం”

తమ హేచరీస్‌, గోదాములపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య‌ జమున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని...

Etela Jamuna: అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తెలుసు.. ఎన్నికుట్ర‌లు చేసినా భ‌య‌ప‌డం
Etela Jamuna
Ram Naramaneni
|

Updated on: May 30, 2021 | 12:50 PM

Share

తమ హేచరీస్‌, గోదాములపై ఫేక్ ప్రచారాలు చేస్తున్నారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ భార్య‌ జమున ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. హైదరాబాద్‌ శివారు శామీర్‌పేటలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జమున మాట్లాడారు. అసత్య ప్రచారాలు తిప్పికొట్టడం తమకు తెలుసన్నారు. తాము స్వ‌శ‌క్తితో కష్టపడి పైకొచ్చామని.. ఎవరినీ మోసం చేయలేదన్నారు. ప్రణాళిక ప్రకారం పోలీసులను ఉప‌యోగించి భయభ్రాంతులకు గురిచేశారని ఆమె ఆరోపించారు. మెదక్‌ జిల్లా మాసాయిపేటలో 46 ఎకరాలు కొనుగోలు చేశామ‌ని.. ఒక్క ఎకరం ఎక్కువగా ఉన్నా ముక్కు నేలకు రాస్తాన‌ని ఆమె స‌వాల్ విసిరారు. సర్వే చేసిన అధికారులు ముక్కు నేలకు రాస్తారా? అని ప్ర‌శ్నించారు. త‌మ‌ స్థలంలో ఏర్పాటు చేసిన పత్రికలోనే దుష్ప్రచారం చేయడం బాధగా ఉంద‌న్న జ‌మున‌… 1992లో దేవరయాంజల్‌ వచ్చి 1994లో అక్కడి భూములు కొన్నామ‌ని తెలిపారు. త‌మ‌ గోదాములు ఖాళీ చేయించి ఆర్థికంగా దెబ్బతీయాలని చూస్తున్నారని… ఎన్ని కుట్రలు చేసినా భయపడేది లేదని స్ప‌ష్టం చేశారు. ఎప్పటికైనా న్యాయం గెలుస్తుంది.. ధర్మమే నిలబడుతుందని చెప్పారు.

సర్వే చేయొద్దని చెప్ప‌లేద‌ని.. మా సమక్షంలో సర్వే చేయాలని చెప్పామ‌న్నారు జ‌మున‌. ఉద్యమం వదిలి అప్ప‌టి సీఎం వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వెంట నడవాలని అప్పట్లో త‌మ‌పై ఒత్తిళ్లు వచ్చాయని… అప్పటి మంత్రి రత్నాకర్‌రావు చాలా సార్లు చెప్సినా..తాము ఆ ఆలోచ‌న చేయ‌లేద‌ని చెప్పారు. సమైక్య పాలనలో కులాలు చూడలేదని.. ఇప్పుడు కులాలతో విభజన చేస్తున్నారని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “అన్ని కులాలు ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. రాష్ట్రం ఏర్పడ్డాక అవమానాలు పెరిగాయి. పౌల్ట్రీ అమ్ముకొని ఉద్యమం కోసం ఖర్చు చేశాం’’ అని జమున అన్నారు.

Also Read: పీఎం కిసాన్ ప‌థ‌కం ఎవ‌రికి వ‌ర్తిస్తుంది.? ఎవ‌రికి వ‌ర్తించ‌దు.. పూర్తి వివ‌రాలు తెలుసుకోండి..