PM KISAN Scheme: పీఎం కిసాన్ పథకం ఎవరికి వర్తిస్తుంది.? ఎవరికి వర్తించదు.. పూర్తి వివరాలు తెలుసుకోండి..
PM KISAN Scheme: రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కిసాన్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి రూ. ఆరు వేలు అందిస్తున్నారు. ఇందులో...
PM KISAN Scheme: రైతుల ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం పీఎమ్ కిసాన్ పేరుతో ఓ పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా రైతు కుటుంబాలకు పెట్టుబడి సాయంగా సంవత్సరానికి రూ. ఆరు వేలు అందిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 14న రైతుల ఖాతాల్లోకి సొమ్మును విడుదల చేశారు. దీంతో దేశ వ్యాప్తంగా సుమారు 9.5 కోట్ల మంది రైతులకు మేలు జరిగింది. ఈ నేపథ్యంలో కొందరు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాకపోవడంతో గందరగోళం నెలకొంది. పీఎమ్ కిసాన్ పథకానికి అప్లై చేసుకున్నాడబ్బులు ఎందుకు జమ అవ్వలేదు, అసలు ఈ పథకానికి ఉండాల్సిన అర్హతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మొదట్లో ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన సమయంలో (ఫిబ్రవరి 2019)లో రెండు హెక్టార్ల కంటే తక్కువ పొలం ఉన్న వారు మాత్రమే అర్హులు అని తెలిపారు. కానీ అనంతరం పొలం ఎంత ఉందన్న దానితో సంబంధం లేకుండా ప్రతీ రైతుకు ఆర్థిక సాయం అందించాలని 2019 జూన్‌లో నిర్ణయం తీసుకున్నారు. ఈ లెక్కన దేశంలో దాదాపు 14.5 కోట్ల మందికి మేలు జరుగుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.
ఎవరు అనర్హులు..
అయితే పథకం అమల్లో భాగంగా కేంద్రం కొన్ని వడపోతలు చేపట్టింది. ఇందులో భాగంగా రాజ్యంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారి కుటుంబసభ్యులకు ఈ పథకం నుంచి మినహాయింపు ఇచ్చారు. అంతేకాకుండా సెంట్రల్, స్టేట్ ప్రభుత్వంలో పని చేసే ఉద్యోగులకు కూడా పీఎం కిసాన్ పథకం వర్తించదు. అంతేకాకుండా డాక్టర్లు, ఇంజనీరింగ్,లాయర్స్‌తో పాటు.. రూ. 10 వేల కంటే ఎక్కువ పెన్షన్ తీసుకునే వారు కూడా ఈ పథకానికి అనర్హులుగా నిర్ణయించారు. ఇక అంతే కాకుండా.. ఆదాయపు పన్ను చెల్లించే రైతులకు కూడా పీఎమ్ కిసాన్ పథకం వర్తించకుండా వారి ఖాతాను జాబితా నుండి తొలగించారు.
Also Read: Mehul Choksi: మెహుల్ చోక్సీ ‘కొరకరాని కొయ్య’… ఇండియాకు అప్పగించరాదంటూ ఆంటిగ్వా విపక్షనేత డిమాండ్…