AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Oxygen: దిగివస్తున్న ఆక్సిజన్ ధరలు.. ఆమేరకు ప్రయోజనం కల్పించని ఆసుపత్రులు..కాన్సన్‌ట్రేటర్ల ధరలూ అందుబాటులోకి!

Oxygen: కరోనా రెండో వేవ్ ప్రారంభం అవుతోనే ప్రజల శ్వాస మీద దాడి చేసింది. ఆక్సిజన్ శరీరానికి అందించే వ్యవస్థలపై విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా కృత్రిమంగా ఆక్సిజన్ ప్రజలకు అందించాల్సిన పరిస్థితి వైద్యులకు వచ్చింది.

Oxygen: దిగివస్తున్న ఆక్సిజన్ ధరలు.. ఆమేరకు ప్రయోజనం కల్పించని ఆసుపత్రులు..కాన్సన్‌ట్రేటర్ల ధరలూ అందుబాటులోకి!
Oxygen
KVD Varma
|

Updated on: May 30, 2021 | 10:23 AM

Share

Oxygen: కరోనా రెండో వేవ్ ప్రారంభం అవుతోనే ప్రజల శ్వాస మీద దాడి చేసింది. ఆక్సిజన్ శరీరానికి అందించే వ్యవస్థలపై విరుచుకుపడింది. దీంతో ఒక్కసారిగా కృత్రిమంగా ఆక్సిజన్ ప్రజలకు అందించాల్సిన పరిస్థితి వైద్యులకు వచ్చింది. ఒక్కసారిగా వేలాది కేసులు ఆక్సిజన్ కోసం వస్తుండటం.. ఆక్సిజన్ సరఫరా అంతగా లేకపోవడంతో చాలా మంది ప్రజలు చనిపోయారు. తరువాత ప్రభుత్వాలు..స్వచ్చంద సంస్థలు.. ప్రపంచదేశాలు ఆక్సిజన్ సరఫరాను మెరుగుపరిచే చర్యలు తీసుకున్నారు. దీంతో ఆక్సిజన్ కొరత కొంత వారకూ తీరింది. ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉన్న సమయంలో ఆక్సిజన్ ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. ఆక్సిజన్ ధరలతో పాటు ఆక్సిజన్ ఇంటివద్దనే సిద్ధం చేసి అందించగల ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ల ధరలూ ఒక్కసారిగా పెరిగిపోయాయి. అసలే ఆక్సిజన్ లేకపోతే మరణం తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆక్సిజన్ అందుబాటులోకి రావడంతో వీటి ధరలు దిగివస్తున్నాయి. ఇది కరోనాతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఊరట కలిగించే విషయంగా చెప్పొచ్చు.

ప్రస్తుతం పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌ ధర 2,000-3,000 రూపాయలు ఉండేది. అది ఇప్పుడు 600 రూపాయలకు దిగివచ్చింది. ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్ల ధర 60,000-70,000 వరకూ అప్పట్లో ఉండేవి. అవి ఇప్పుడు 15,000-25,000 మధ్యలో దొరుకుతున్నాయి. ఆక్సిజన్‌ శాచురేషన్‌ (ఎస్‌పీఓ2) స్థాయులు 90 కంటే తగ్గిన వారికి కనీసం నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో మెడికల్‌ ఆక్సిజన్‌ అందించాల్సిన పరిస్థితి. ఈ సదుపాయం ఉన్న పడక కోసం ప్రైవేటు ఆసుపత్రుల్లో రోజుకు 20,000 నుంచి 30,000 రూపాయల ఫీజు వసూలు చేశారు. నిజానికి ఈ ఏడాది ఏప్రిల్‌ మొదటివారం వరకు 150 క్యూబిక్‌ మీటర్‌ మెడికల్‌ ఆక్సిజన్‌ ఉండే పెద్ద సిలిండర్‌ను నింపి ఇచ్చేందుకు తయారీ సంస్థలు 350 రూపాయలు మాత్రమే తీసుకునేవి. గిరాకీ పెరిగి పోవడంతో ఏప్రిల్‌ మధ్య కాలం నుంచి 600 రూపాయలు తీసుకోవడం ప్రారంభించాయి .ఆతరువాత దీని ధర క్రమేపీ 1,000 రూపాయలకు, మే మొదటి వారానికల్లా 2,500 నుంచి 3,000 రూపాయలకు చేరుకుంది. ఇంత ధర పెట్టినా అదీ దొరకక చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.

ధరలు తగ్గాయి..

కేసులు తగ్గుముఖం పడుతుండటం.. దానికి తోడుగా విశాఖ స్టీల్ ప్లాంట్, మేఘా ఇంజనీరింగ్ కంపెనీ వంటి సంస్థలు ఆసుపత్రులకు ఆక్సిజన్(Oxygen) ఉచితంగా సరఫరా చేయడం మార్కెట్ లో ఆక్సిజన్ రేటు పై ప్రభావాన్ని చూపించింది. అంతేకాకుండా ఆక్సిజన్‌ సరఫరాకు కావాల్సిన ఆక్సిజన్‌ క్రయోజనిక్‌ ట్యాంకర్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. దీంతో ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే ప్రైవేటు సంస్థలు కూడా రీఫిల్లింగ్‌ ఛార్జీలను తగ్గిస్తూ వస్తున్నాయి. ప్రస్తుతం ఆసుపత్రులలో వినియోగించే పెద్ద సిలిండర్‌ రీఫిల్లింగ్‌కు హైదరాబాద్‌లో కనిష్ఠంగా రూ.600, గరిష్ఠంగా రూ.1000 వసూలు చేస్తున్నారు.

తగ్గిన డిమాండ్..

ఈ నెల మొదటి వారంలో ఆక్సిజన్‌ బెడ్స్, బైపాప్‌-వెంటిలేటర్లతో కూడిన 30 పడకలున్న ఆసుపత్రికి రోజుకు 100 వరకు పెద్ద ఆక్సిజన్‌ సిలిండర్లు అవసరమయ్యేవి. ఇప్పుడు ఆ అవసరం 30 నుంచి 40 శాతం వరకూ పడిపోయింది. దీంతో ఆక్సిజన్ సరఫరా రేటు తగ్గింది. అయితే, ఈ ప్రయోజనాన్ని ఇంకా చాలా ఆసుపత్రులు కరోనా పేషెంట్స్ కి అందివ్వకపోవడం విచారకరం. ఆక్సిజన్ రేటు పెరిగిందని చార్జీలు పెంచిన ఆసుపత్రులు.. ఇప్పుడు ఆక్సిజన్ అందుబాటు ధరల్లో ఉన్నా ఆమేరకు పేషెంట్స్ కు ఎక్కడా ధరలు తగ్గించలేదు.

ఒక రోగికి ఎంత అవసరం?

ఒక రోగికి నిమిషానికి 5 లీటర్ల సామర్థ్యంతో ఆక్సిజన్‌ (Oxygen) నిరంతరాయంగా అందిస్తే పెద్ద సిలిండరు 10-12 గంటల పాటు వస్తుంది. అదే 2 లీటర్ల సామర్థ్యంతో అందిస్తే 18-24 గంటల పాటు ఆక్సిజన్‌ సరఫరా చేయొచ్చు. అంటే ప్రస్తుతం ఉన్న ఆక్సిజన్ ధరలతో 600 రూపాయలతో ఒక రోగికి రోజుకు ఆక్సిజన్ అందించవచ్చు. కానీ, దానికి దాదాపు పదిరెట్లు కార్పోరేట్ ఆసుపత్రులు వసూలు చేస్తున్నాయి.

భారీగా తగ్గిన కాన్సన్‌ట్రేటర్ల ధరలు..

ఇంటివద్ద చికిత్స తీసుకున్తున్నవారికి ఆక్సిజన్ కాన్సన్‌ట్రేటర్ మిషన్లు చాలా ఉపయోగకరం. ఈ పోర్టబుల్ మిషన్ సహాయంతో కరోనా కష్టంలో ఇంటివద్దనే చాలా మంది వైద్యుల సలహాతో సహాయం పొందారు. ఇవి కూడా కొద్ది రోజుల క్రితం విపరీతంగా ధరలు పెరిగిపోయాయి. అయితే, ఇప్పుడు వీటి ధరలూ దిగివచ్చాయి. ఈ సంవత్సరం జనవరిలో 7 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ 32 వేల రూపాయలకు మార్కెట్ లో దొరికేది. అదే విధంగా 9 ఎల్‌పీఎం సామర్థ్యం గల ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్‌ 36 వేల రూపాయలు ఉండేది. అది అమాంతం ఏప్రిల్ నెల మధ్య నాటికి 65 వేల రూపాయల నుంచి 70 వేల రూపాయలకు చేరుకుంది. అదే పెద్ద కంపనీలకు చెందిన వాటిని లక్ష రూపాయలకు పైగా ధరను నిర్ణయించి అమ్మారు. ఇప్పుడు పరిస్థితి మళ్ళీ మారింది. డిమాండ్ తగ్గటం.. విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వీటిపై సుకాలను రద్దు చేయడంతో దేశీయంగా వీటి రెట్లు గణనీయంగా తగ్గాయి. ప్రస్తుతం ఇంటెక్స్‌, మైక్రోటెక్‌, మ్యాన్‌కైండ్‌, డెకెన్‌మౌంట్‌ వంటి దేశీయ సంస్థలు 5 లీటర్ల సామర్థ్యం కలిగిన కాన్సన్‌ట్రేటర్లను ఏడాది వారెంటీ తొ 15 వేల రూపాయలకే అందిస్తున్నారు. అదేవిధంగా 7 ఎల్‌పీఎం 25 వేలకు, 9 ఎల్‌పీఎం 35 వేలకు అందుబాటులోకి వచ్చింది. దేశీయంగా వీటి ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది.

Also Read: Good News: 2021 చివరికల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం సాధ్యమేనా? ఎయిమ్స్ చీఫ్ ఏమన్నారంటే?

China Scientists: కరోనా పాపానికి కారకులు చైనా పరిశోధకులే..ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో స్పష్టం!