Good News: 2021 చివరికల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం సాధ్యమేనా? ఎయిమ్స్ చీఫ్ ఏమన్నారంటే?

Covid-19 Vaccination: కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుముందు జోరందుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ వ్యాక్సిన్లకు తోడు మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.

Good News: 2021 చివరికల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్లు ఇవ్వడం సాధ్యమేనా? ఎయిమ్స్ చీఫ్ ఏమన్నారంటే?
Covid Vaccine
Follow us
Janardhan Veluru

|

Updated on: May 29, 2021 | 7:28 PM

కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందుముందు మరింత జోరందుకోనుంది. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన కొవిషీల్డ్, కొవాక్సిన్, స్పుట్నిక్ వీ వ్యాక్సిన్లకు తోడు మరికొన్ని విదేశీ వ్యాక్సిన్లు దేశ ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే దేశంలో వ్యాక్సిన్ల ఉత్పత్తి ఒకట్రెండు మాసాల్లోనే గణనీయంగా పెరిగే అవకాశముంది. ఈ సంవత్సరం చివరినాటికల్లా దేశంలోని అందరికీ వ్యాక్సిన్లు అందేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇది సాధ్యమేనా? అన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియకు సంబంధించి ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సస్(AIIMS) చీఫ్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో కొవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ ముందు ముందు జోరందుకోనున్నట్లు చెప్పారు.

దేశంలో ఎక్కువ మందికి వ్యాక్సిన్లను అందుబాటులోకి తెచ్చేందుకు వాటి ఉత్పత్తిని గణనీయంగా పెంచనున్నట్లు రణ్‌దీప్ గులేరియా పేర్కొన్నారు. అలాగే విదేశాల నుంచి వీలైనన్ని వ్యాక్సిన్లు కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వివరించారు. జులై మాసం చివరి నాటికి దేశంలో ప్రతి రోజు కోటి మందికి వ్యాక్సిన్లు ఇచ్చే అవకాశమున్నట్లు ఆయన వెల్లడించారు. గర్భిణి మహిళలు కరోనా బారినపడి ఎక్కువగా చనిపోతుండటంపై స్పందిస్తూ…దేశంలో గర్భిణి మహిళలకు వీలైనంత త్వరగా వ్యాక్సిన్లు ఇచ్చేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. అయితే గ్లోబల్ గణాంకాలను పరిశీలిస్తే…గర్భిణి మహిళలకు వ్యాక్సినేషన్‌లో ప్రభావం కాస్త ప్రతికూలంగా ఉందన్నారు.

Covid Vaccine

Covid Vaccine

కొవాక్సిన్ టీకా ఇతర ఫ్లూ వ్యాక్సిన్లు తరహాదేనన్న ఆయన… గర్భిణి స్త్రీలకు ఇది సురక్షితం కావచ్చని అభిప్రాయపడ్డారు. ఇమ్యునిటీని పెంచుకునే ఉద్దేశంతో ప్రజలు భారీ ఎత్తున మల్టీవిటమిన్లు, జింక్ సప్లిమెంట్స్‌ను తీసుకోవడంపై ఆయన స్పందించారు. దాని ద్వారా వచ్చే నష్టమేమీ లేదుకానీ…ఎక్కువ కాలంపాటు వీటిని తీసుకోవడం మంచిది కాదని అభిప్రాయపడ్డారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ… సహజ వనరులతో శరీరంలో విటమిన్లు, జింక్ పెంచుకునేందుకు ప్రజలు ప్రయత్నించాలని సూచించారు.

ఎయిమ్స్ చీఫ్ గులేరియా పేర్కొన్నట్లు దేశంలో జులై చివరినాటికి ప్రతి రోజూ కోటి మందికి వ్యాక్సిన్లు ఇవ్వగలిగే సామర్థ్యం పొందితే…సంవత్సరం చివరి నాటికల్లా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యే అవకాశముంది.

ఇవి కూడా చదవండి..

రాష్ట్రాలకు రెమిడెసివిర్ మందును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం….రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని ఉత్తర్వులు

కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!