Special Vaccination: గ్రేటర్ హైదరాబాద్‌లో రెండో రోజు ఫుల్ సక్సెస్.. 22,399 మందికి వాక్సిన్

special-vaccination: గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండో రోజు కూడా స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి

Special Vaccination: గ్రేటర్ హైదరాబాద్‌లో రెండో రోజు ఫుల్ సక్సెస్.. 22,399 మందికి వాక్సిన్
Covi Vaccination
Follow us

|

Updated on: May 29, 2021 | 8:05 PM

గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండో రోజు కూడా స్పెషల్‌ కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ విజయవంతమైంది. హైరిస్క్‌ ఉన్న నిత్య సేవలకులకు 30 సర్కిళ్ల పరిధిలోని 31 కేంద్రాల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేశారు. రెండోరోజైన శనివారం నాడు 22,399 మందికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ఇచ్చారు. జీహెచ్ఎంసీ పరిధిలో శుక్రవారం ప్రారంభమైన మొదటి రోజు 21,666 మందికి వాక్సినేషన్ అందించగా ఇవాళ 22,399 మందికి టీకాను అందించారు. నిత్య సేవకులుగా గుర్తించిన వివిధ రంగాలకు చెందినవారికి పది రోజుల పాటు వాక్సిన్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ ముప్పై సర్కిళ్లలో విస్తృత ఏర్పాట్లను చేపట్టింది. ముందుగానే గుర్తించిన  వారికి ప్రత్యేక టోకెన్లను అందచేసి వారికి ఇచ్చే వాక్సినేషన్ సమయాన్ని కూడా ప్రత్యేకంగా పేర్కొనడంతో ఏవిధమైన ఇబ్బందులు లేకుండా కోవిడ్ నిబంధనలతో సజావుగా సాగింది.

టీకా వేసుకున్నవారు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. రోజూ 30 వేల మందికి చొప్పున వచ్చే తొమ్మిది రోజుల పాటు ఈ స్పెషల్‌డ్రైవ్‌ కొనసాగనున్నది. కాగా నగరంలో ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియను పలువురు ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్ పలు కేంద్రాలను సందర్శించి పరిశీలించారు.

ఇవి కూడా చదవండి :  Monsoon Winds: తెలుగు రాష్ట్రల ప్రజలకు చల్లని కబురు.. కేరళలోకి ప్రవేశించనున్న రుతు పవనాలు

Amazing Viral Video: గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…

యాజమానులు చేసిన పనికి షాక్ తిన్న కుక్కపిల్ల.. పాపం.. అక్కడే అలా.. నవ్వులు పూయిస్తున్న Viral Video

PM KISAN Yojana: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!