Harish Rao : కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు

కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు..

Harish Rao : కేంద్రం ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు
Harish Rao
Follow us
Venkata Narayana

|

Updated on: May 29, 2021 | 6:13 PM

GST Council group of Ministers : జీఎస్టీ నుంచి కొవిడ్ రిలీఫ్ మెటీరియల్‌కు రాయితీలు.. మినహాయింపులు అంశంపై కేంద్ర ఆర్థిక శాఖ తాజాగా ఏర్పాటు చేసిన గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ టీమ్‌లో తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు స్థానం కల్పించారు. నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో జరిగిన 43వ జీఎస్టీ కౌన్సిల్‌లో మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలసిందే. మేఘాలయ ముఖ్యమంత్రి కన్రాడ్ కె సంగ్మా కన్వీనర్ గా మొత్తం 8 మందితో మంత్రుల బృందం ఏర్పాటు చేసింది కేంద్ర ఆర్థిక శాఖ. కరోనా వ్యాక్సిన్లు, ఔషధాలు, కొవిడ్ టెస్టు కిట్లతో పాటు కరోనా నియంత్రణలో ఉపయోగించే వస్తువులపై రాయితీలు.. ఇంకా మినహాయింపులపై ఈ మంత్రుల కమిటీ సిఫార్సులు చేయనుంది. కాగా, నిన్న జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ అనంతరం ఆర్ఠిక మంత్రి మాట్లాడుతూ కొవిడ్ వ్యాక్సిన్లపై పన్ను రేట్లు యథాతథంగానే కొనసాగనున్నాయని తెలిపిన సంగతి తెలిసిందే. కొవిడ్‌ ఔషధాలు, వ్యాక్సిన్లు, వైద్య పరిరకాలపై విధిస్తున్న పన్ను అంశంపై జీఎస్టీ మండలిలో ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఆర్థిక మంత్రి.. పన్ను తగ్గింపు అంశంపై మంత్రి వర్గ ఉప సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ ఉపసంఘం 10 రోజుల్లో నివేదిక ఇస్తుందని తెలిపారు. అయితే, విరాళంగా వచ్చిన వైద్య పరిరకాలకు సంబంధించి జీఎస్టీ మినహాయింపు కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు.

ప్రభుత్వం లేదా ఏజెన్సీలకు వచ్చే వైద్య పరిరకాలపై మినహాయింపు ఈ ఏడాది ఆగస్టు 31 వరకు కొనసాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి తెలిపారు. అలాగే, మినహాయింపు జాబితాలో బ్లాక్‌ ఫంగస్‌ చికిత్సకు ఉపయోగించే ఆంఫోటెరిసిస్‌-బి ఔషధాన్ని చేర్చినట్లు వివరించారు. 1.58 లక్షల కోట్ల రూపాయలు సేకరించి జీఎస్​టీ లోటు కింద రాష్ట్రాలకు అందించేందుకు ప్యానల్​ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ప్రత్యేక భేటీ నిర్వహించి జీఎస్​టీ లోటు పరిహారం వ్యవధిని 2022 ఆపైన పెంచేందుకు నిర్ణయం తీసుకోనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు.

ఇలా ఉండగా, నిన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ వీడియో కాన్ఫెరెన్సింగ్ మీటింగ్ లో తెలంగాణ ఆర్ఠిక మంత్రి హరీశ్ రావు తెలంగాణ వాణిని గట్టిగా వినిపించారు. దేశంలో కేంద్రం నుంచి అతి‌ తక్కు‌వ జీఎస్టీ పరిహారం తీసుకుంటున్న రాష్ట్రం తెలంగాణనే అని హరీశ్‌ రావు స్పష్టం చేశారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో అన్నిరాష్ట్రాల ఆర్థిక లోటు 36.3 శాతం ఉండగా, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక లోటు 23.10 శాతంగా ఉందని ఆయన తెలిపారు. ప్రజారోగ్య సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నదని.. ఈ పరిస్థితుల్లో ఎఫ్ఆర్బీఎం పరిధిని 3 శాతం నుంచి 5‌ శాతానికి పెంచాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఐజీఎస్టీ నిధులు గతేడాది రూ. 2,638 కోట్లు వచ్చాయని వెల్లడించారు. ఈ ఏడాది ఐజీఎస్టీ నిధులు రూ. 13 వేల కోట్ల నుంచి రాష్ట్రానికి రావాల్సిన రూ. 218 కోట్లు వెంటనే విడుదల చేయాల‌ని కోరారు. న్యూట్రల్ ఆల్కహాల్‌ను జీఎస్టీ నుంచి మినహాయించాలని కూడా మంత్రి కేంద్రాన్ని కోరారు.

Gst Council Group Of Minist

Gst Council Group Of Minist

Read also : Azam Khan : ఎస్పీ సీనియర్ నేత ఆజంఖాన్ పరిస్థితి విషమం, తండ్రీకొడుకులిద్దరికీ మేదాంతలో ట్రీట్మెంట్