TGCET 2021: కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా… పూర్తి వివరాలు
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ పరీక్షను...
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న టీజీసెట్ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు కన్వీనర్ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. దీంతో ఆదివారం జరగాల్సిన గురుకులాల ఐదో తరగతి పరీక్ష వాయిదా పడింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టీజీసెట్ పరీక్షను మళ్లీ ఎప్పుడు నిర్వహించనున్నామో తర్వాత వెల్లడిస్తామని కన్వీనర్ వివరించారు. గురుకుల పాఠశాలల్లో 2021–22 విద్యా సంవత్సరానికి గానూ 5వ తరగతి సీట్లను భర్తీ చేసేందుకు టీజీసెట్-2021 నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. కొవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలో ఇప్పటికే పలు ఎగ్జామ్స్ వాయిదా పడటం, రద్దు చేసిన విషయం తెలిసిందే. టీజీసెట్ పరీక్షకు సంబంధించిన వివరాలను వెబ్‌సైట్: https://tgcet.cgg.gov.in/ తెలుసుకోవచ్చు. ప్రవేశాలకు సంబంధించి సందేహాల నివృత్తికి, సమస్యల పరిష్కారానికి 180042545678 అనే టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేయవచ్చు.
వివిధ గురుకులాల్లో సీట్ల వివరాలు:
సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ సొసైటీ- 18,560 గిరిజన సంక్షేమ సొసైటీ- 4,777 బీసీ సంక్షేమ సొసైటీ- 20,800 జనరల్ వెల్ఫేర్ సొసైటీ- 2800
Also Read: కోళ్లను ముద్దు చేస్తున్నారా….. వాటి ద్వారా కొత్త ఇన్‌ఫెక్షన్.. సీడీసీ హెచ్చరిక
బిర్యానీ ఆర్డర్ సరిగ్గా ఇవ్వలేదంటూ కేటీఆర్‌ను ట్యాగ్ చేసిన నెటిజన్.. మంత్రి రిప్లై భలే ఫన్నీ