రాష్ట్రాలకు రెమిడెసివిర్ మందును నిలిపివేసిన కేంద్ర ప్రభుత్వం….రాష్ట్రాలే కొనుగోలు చేసుకోవాలని ఉత్తర్వులు
కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమిడెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిన దృష్ట్యా రాష్ట్రాలకు దీని కేటాయింపును నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిమాండుకు మించి సప్లయ్ ఎక్కువగా ఉన్నందున...
కోవిడ్ రోగుల చికిత్సలో వాడే రెమిడెసివిర్ మెడిసిన్ ఉత్పత్తి 10 రెట్లు పెరిగిన దృష్ట్యా రాష్ట్రాలకు దీని కేటాయింపును నిలిపివేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. డిమాండుకు మించి సప్లయ్ ఎక్కువగా ఉన్నందున దీని కేటాయింపును ఇక కొనసాగించబోమని స్పష్టం చేసింది. గత ఏప్రిల్ 11 నాటికి దీని ఉత్పత్తి రోజుకు 33 వేల వైల్స్ కాగా ఆ తరువాత – ఇది రోజుకు 3,50,000 వైల్స్ పెరిగిందని రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మాన్ సుఖ్ మాండవీయ తెలిపారు. ప్రధాని మోదీ ‘అద్భుత నాయకత్వం కింద’ ఈ అతి ముఖ్యమైన మెడిసిన్ ఉత్పత్తి ఎంతో పెరిగిందని ఆయన ట్వీట్ చేశారు. డిమాండుకు మించి సప్లయ్ ఉన్న కారణంగా ఇక రాష్ట్రాలకు దీని కేటాయింపును నిలిపివేయాలని తమ మంత్రిత్వ శాఖ నిర్ణయించిందన్నారు. పైగా నెల రోజుల్లోగా ఈ మందును ఉత్పత్తి చేసే ప్లాంట్ల సంఖ్యను 20 నుంచి 60 ప్లాంట్లకు ప్రభుత్వం పెంచిందని, ఇప్పుడు దేశంలో రెమిడెసివిర్ తగినంతగా ఉందని ఆయన పేర్కొన్నారు. అత్యవసర వినియోగానికి గాను స్టాక్ గా ఉంచుకోవడానికి 50 లక్షల వైల్స్ ను ప్రొక్యూర్ చేయాలని కూడా ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. దేశంలో ఈ మెడిసిన్ లభ్యతను మానిటరింగ్ చేయాలని నేషనల్ ప్రైసింగ్ ఏజెన్సీని ఆదేశించినట్టు మాండవీయ వెల్లడించారు. ఈ మందుపై సర్కార్ కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేసిందని, ఫలితంగా దేశీయంగా ఈ ఇంజెక్షన్ ధర తగ్గుతుందని అన్నారు.
కాగా గత ఏప్రిల్ 11న ఈ మందు ఎగుమతిపై కేంద్రం నిషేధం విధించింది. రెమిడెసివిర్ పై కస్టమ్స్ సుంకాన్ని రద్దు చేయాలని పలువురు డిమాండ్ చేశారు. దీనిపై ఢిల్లీ హైకోర్టులో ఓ అడ్వొకేట్ పిల్ కూడా దాఖలు చేశారు.
మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ : బయటికి ఎందుకొచ్చావ్ అని అడిగితే..! ఇతని తలతిక్క సమాధానం చూడండి.నవ్వు ఆపుకోలేరు :Varal Video.
ఏనుగును చూసి పరిగెత్తిన పులి..!పులా..?ఏనుగా..?దియా మీడియాతో ఫుల్ కన్ఫ్యూజన్ : Viral Video.