China Scientists: కరోనా పాపానికి కారకులు చైనా పరిశోధకులే..ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో స్పష్టం!
China Scientists: మొత్తం ప్రపంచం కొంప ముంచింది చైనా శాస్త్రవేత్తలే. కరోనా సోకిన గబ్బిలాల మీద వీరు చేసిన పరిశోధన ఇప్పుడు ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసింది.
China Scientists: మొత్తం ప్రపంచం కొంప ముంచింది చైనా శాస్త్రవేత్తలే. కరోనా సోకిన గబ్బిలాల మీద వీరు చేసిన పరిశోధన ఇప్పుడు ప్రపంచ మానవాళి జీవితాలనే మార్చేసింది. చైనా శాస్త్రవేత్తలు గబ్బిలాలను పరిశోధిస్తున్న సమయంలో కరోనా సోకిన గబ్బిలాలు శాస్త్రవేత్తలను కరిచాయి. అదే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 3.5 మిలియన్లకు పైగా ప్రజలకు మరణ శాసనం రాసింది. తైవాన్ నుంచి వస్తున్న మీడియా కథనాల ప్రకారం అసలక్కడ ఏం జరిగిందంటే..
చైనాలోని వూహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (డబ్ల్యుఐవి) లో ప్రమాదకర వైరస్ లపై పరిశోధనలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఇక్కడ గబ్బిలాల ద్వారా వ్యాపించే వైరస్ లకు సంబంధించిన పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా బ్యాట్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. ఇక్కడ ఉండే పరిశోధకులు దగ్గరలోని కొండ బిలంలో ఉండే గబ్బిలాల పై పరిశోధనలు జరుపుతున్నారు. వాటి మలం.. వాటి రక్తం.. వాటి మాసం ఇలా అన్నిటినీ అక్కడ నుంచి సేకరించి వూహాన్ ల్యాబ్ కు తెచ్చి పరిశోధనలు చేస్తారు. ఈ క్రమంలో ఒకసారి ఇద్దరు శాస్త్రవేత్తలను గబ్బిలాలు కరిచాయి. ఆ ఇద్దరు శాస్త్రవేత్తలే ఇప్పడు ఈ అనర్ధానికి మూలం. ఇంత ప్రమాదకర వైరస్ ల పై పరిశోధనలు చేస్తున్న వీరు ఎంతో అజాగ్రత్తగా వ్యవహరించారని తెలుస్తోంది. ఇంతకీ ఇది జరిగింది 2017లో అప్పటి నుంచి ఈ విషయాన్ని చైనా గోప్యంగా ఉంచింది. తరువాత కరోనా వైరస్ క్రమంగా మనుషుల్లో విస్తరించడం ప్రారంభం అయింది. అయితే, 2019 వరకూ ఈ ప్రమాదాన్ని గుర్తించలేకపోయింది చైనా అని అంటున్నారు. ఇప్పుడు ఈ విషయం ప్రపంచ ఆరోగ్య సంస్థ విచారణలోనూ స్పష్టం అయినట్టు చెబుతున్నారు.
గతంలోనే ఈ విషయంపై అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ బ్యాట్ రీసెర్చ్ ల్యాబ్ మహమ్మారి వ్యాప్తికి కేంద్రంగా ఉండటంపై యాదృచ్చికంగా అనుమానాలను వ్యక్తం చేశారు. ఇలాంటి వైరస్లతో సహా దాని పరిశోధన పై అనుమానాలున్నట్టు చెప్పారు. ఇపుడు అదే నిజం అయింది. మొదటిసారి కరోనా కేసులు అధికారికంగా గుర్తించబడటానికి ముందే, నవంబర్ 2019 లో ల్యాబ్ లోని ముగ్గురు పరిశోధకులు ఒక రహస్య అనారోగ్యానికి గురవుతున్నారని యూఎస్ ఇంటెలిజెన్స్ నివేదిక ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు బిడెన్ చివరకు ఆ ప్రయోగశాలపై దృష్టి పెట్టారు.
మరి ప్రస్తుతం ఈ ఉదంతానికి కారణం స్పష్టంగా తెలుస్తున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చేస్తుంది అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకూ అయితే, సుస్పష్టంగా చైనా ల్యాబ్ లోని పరిశోధకుల వల్లే కరోనా మహమ్మారి ప్రపంచం మీద పడింది అనే విషయం స్పష్టం అయినట్టే!
Also Read: NASAL SPRAY: కరోనాపై పోరులో కొత్త శకం.. నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌తో 99శాతం చెక్.. త్వరలో భారత్‌లోను?