AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

NASAL SPRAY: కరోనాపై పోరులో కొత్త శకం.. నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌తో 99శాతం చెక్.. త్వరలో భారత్‌లోను?

కరోనా వైరస్‌కు చెక్ పెట్టడంలో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవిష్కృతమవుతోంది. చాలా దేశాలు కరోనా అంతానికి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ పోరాటంలో...

NASAL SPRAY: కరోనాపై పోరులో కొత్త శకం.. నాజల్ స్ప్రే వ్యాక్సిన్‌తో 99శాతం చెక్.. త్వరలో భారత్‌లోను?
Check For Corona
Rajesh Sharma
|

Updated on: May 29, 2021 | 7:01 PM

Share

NASAL SPRAY MEDICINE KILLS 99% VIRUS: కరోనా వైరస్‌కు చెక్ పెట్టడంలో రోజుకో కొత్త ఆవిష్కరణ ఆవిష్కృతమవుతోంది. చాలా దేశాలు కరోనా అంతానికి పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. కొన్ని దేశాలు ఈ పోరాటంలో కలిసి పని చేస్తున్నాయి. కరోనా సెకెండ్ వేవ్ గడగడలాడిస్తున్న తరుణంలో శాస్త్రవేత్తలు తమ పరిశోధనలను మరింత వేగవంతం చేశారు. మానవాళిని రక్షించుకోవాలంటే పరిశోధనలు, అధ్యయనాలు మరింత వేగాన్ని సంతరించుకోవాల్సి వుందని పలు దేశాధినేతలు అభిప్రాయపడుతున్నారు. తాజాగా కరోనా అంతం దిశగా జరుగుతున్న పరిశోధనల్లో మరో శకానికి నాందీ పడినట్లు సైంటిస్టులు ప్రకటించారు.

సెకెండ్ వేవ్ ఉధృతి ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న తరుణంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. అమెరికా వంటి చోట్ల అయితే.. వ్యాక్సిన్ వేయించుకున్న వారికి భారీ బహుమానాలను, నగదు రివార్డులను ఇస్తున్నారు. ఈక్రమంలోనే పలు దేశాలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పిల్లలకు, తక్కువ ముప్పు వున్న వారికి కూడా విస్తరించాయి. ప్రస్తుతం వున్న కరోనా వైరస్ మ్యూటెంట్ రకాలను ఎదుర్కొనేలా వ్యాక్సిన్లను అప్‌గ్రేడ్ చేస్తున్నారు. తాజాగా ముక్కులో వేసే నాజల్ స్ప్రేల రాకతో కరోనాపై పోరాటం కొత్త టర్న్ తీసుకుంటుందని సైంటిస్టులు అభిప్రాయపడుతున్నారు.

కెనడాలోని శానోటైజ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంటు కార్పొరేషన్ అనే ఆర్గనైజేషన్ నైట్రిక్ యాక్సైడ్ స్ప్రేను రూపొందించింది. ఇది కరోనా బాధితుల్లో వైరల్ లోడును 99 శాతం వరకు నిర్మూలిస్తుందని శానోటైజ్ సంస్థ వెల్లడించింది. ఈ మందు ఎగువ శ్వాసనాళాల్లో వున్న వైరస్‌ను అంతమొందిస్తుందని తెలిపింది. ఎగువ శ్వాసనాళాల్లో పాగా వేసే కరోనా వైరస్ అక్కడ్నించి ఊపిరితిత్తుల్లోకి విస్తరించి.. మనిషి ప్రాణాలను హరిస్తోంది. అయితే ఈ నాజల్ స్ప్రే ద్వారా ఎగువ శ్వాసనాళాల్లో వున్న వైరస్‌ను అక్కడే అంతమొందిస్తే.. ఇక ఊపిరితిత్తులకు పెద్దగా ప్రమాదం వుండదని సైంటిస్టులు అంఛనా వేస్తున్నారు.

కోవిడ్ బారిన పడిన 79 మందిపై ఈ నాజల్ స్ప్రేను వాడి చూశారు. దీన్ని వాడిన కేవలం 24 గంటల్లోనే వారిలో 95 శాతం వైరల్ లోడు తగ్గిపోయిందని సైంటిస్టులు నిర్దారణకు వచ్చారు. ఆ తర్వాత 72 గంటల్లో 99 శాతం వైరల్ లోడు తగ్గిందని తెలిపారు. తాజాగా బ్రిటన్‌లో వెలుగు చూసిన కరోనా వైరస్ మ్యూటెంట్ రకంపై కూడా ఈ నాజల్ స్ప్రే చక్కగా పని చేస్తుందని తేల్చారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా లేవని ప్రకటించారు. నైట్రిక్ యాక్సైడ్ స్ప్రే వినియోగానికి న్యూజీలాండ్, ఇజ్రాయెల్ ఇటీవల గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. మనదేశంలోను దీన్ని ఉత్పత్తి చేసేందుకు శానోటైజ్ సంస్థ చర్చలు ప్రారంభించింది. ఈ నాజల్ స్ప్రే గేమ్ చేంజర్ అవుతందన్న విశ్వాసాన్ని శాస్త్రవేత్తల బృందం వ్యక్తం చేస్తోంది.

ALSO READ: ఈటలపై పోటీకి రంకెలేస్తున్న పలువురు నేతలు.. దశాబ్ధంపైగా ఎదురుచూపులకు ఇదే తెర!

ALSO READ: మరోసారి ఐసోలేషన్ సెంటర్లుగా స్టార్ హోటళ్ళు.. హైదరాబాద్‌లో విచిత్ర పరిస్థితి

ALSO READ: ప్రధాన మంత్రి మెడకు బ్రేక్‌ఫాస్ట్ బిల్లు ఉచ్చు.. నిధుల దుర్వినియోగమంటూ పోలీసుల విచారణ షురూ!