India Corona update: దేశంలో తగ్గిన కరోనా కేసులు.. గత 47 రోజుల్లో అతి తక్కువ కేసులు నమోదు.. మరణాల సంఖ్య ఇంకా అలానే!
India Corona update: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 1,65,553 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య గత 47 రోజులలో అతి తక్కువ.
India Corona update: దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఇండియాలో కొత్తగా 1,65,553 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య గత 47 రోజులలో అతి తక్కువ. ఇంతకు ముందు ఏప్రిల్ 12 వ తేదీన 1,60,854 కేసులు నమోదు అయ్యాయి. ఇక మరణాల సంఖ్య మాత్రం ఇంకా ఆందోళనకరంగానే ఉంది. 24 గంటలలో కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 3,460 గా నమోదు అయింది. ఇదిలా ఉంటే గడిచిన 24 గంటల్లో 2,64,342 మంది కరోనా కోరల నుంచి బయటపడ్డారు. దీంతో ప్రస్తుతం దేశం మొత్తం మీద ఇప్పటివరకూ 2,78,94,800 కరోనా కేసులు నమోదు అయ్యాయి. అదేవిధంగా మొత్తం 3,25,972 మరణాలు ఇప్పటివరకూ నమోదు అయ్యాయి.
మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నా.. కరోనా వ్యాప్తిలో తగ్గుదల కొంత ఊరట కలిగిస్తోంది. చాలా రోజులుగా, దేశంలో రోజుకు సగటున 2 లక్షల మంది కరోనా నుండి కోలుకుంటున్నారు. గత 10 రోజుల గురించి చెప్పుకుంటే కనుక దేశంలో 27.40 లక్షల మంది కరోనాను ఓడించారు. ఈ కారణంగా, క్రియాశీల కేసుల సంఖ్య అంటే చికిత్స పొందుతున్న రోగుల సంఖ్య నిరంతరం తగ్గుతూ వస్తోంది. ఇది కరోనా విషయంలో ప్రజలకు ఒక మంచి వార్తగానే చెప్పొచ్చు.
దేశంలో కరోనా మహమ్మారి గణాంకాలు ఇలా ఉన్నాయి..
- గత 24 గంటల్లో మొత్తం కొత్త కేసులు : 1.65 లక్షలు
- గత 24 గంటల్లో కోలుకున్న వారు : 2.64 లక్షలు
- గత 24 గంటల్లో మొత్తం మరణాలు: 3,463
- ఇప్పటివరకు కరోనా సోకిన వారు మొత్తం : 2.78 కోట్లు
- ఇప్పటివరకు నయం అయిన వారు : 2.54 కోట్లు
- ఇప్పటివరకు మొత్తం మరణాలు: 3.25 లక్షలు
- ప్రస్తుతం చికిత్స పొందుతున్న మొత్తం రోగుల సంఖ్య: 21.09 లక్షలు
ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ ఆంక్షలు ఉన్న రాష్ట్రాలు..
దేశంలోని 19 రాష్ట్రాలలో పూర్తి లాక్ డౌన్ ఆంక్షలు ప్రస్తుతం అమలులో ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గగడ్, ఒడిశా, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, మిజోరాం, గోవా, తెలంగాణ, పశ్చిమ బెంగాల్ పుదుచ్చేరిలలో ప్రస్తుతం లాక్ డౌన్ కతినంగా అమలు చేస్తున్నారు.
పాక్షికంగా లాక్ డౌన్ ఉన్న రాష్ట్రాలు ఇవే..
దేశంలోని 13 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాక్షిక లాక్డౌన్ అమలు చేస్తున్నారు. అంటే, అక్కడ పరిమితులు ఉన్నప్పటికీ మినహాయింపులు కూడా ఉన్నాయి. వీటిలో పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, అస్సాం, మణిపూర్, త్రిపుర, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ ఉన్నాయి.
కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!