Mehul Choksi: ఢిల్లీ నుంచి డొమినికాలో దిగిన విమానం,…వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకురావడానికేనా ..?

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ విమానం డొమినికాలో దిగింది. ఇది వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకురావడానికేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

Mehul Choksi: ఢిల్లీ నుంచి డొమినికాలో దిగిన విమానం,...వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకురావడానికేనా ..?
Plane Landed In Dominica
Follow us

| Edited By: Phani CH

Updated on: May 30, 2021 | 9:55 AM

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఓ విమానం డొమినికాలో దిగింది. ఇది వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని ఇండియాకు తీసుకురావడానికేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అతడిని తమకు అప్పగించాలని ఇండియా డొమినికాను కోరుతోంది. ఖతర్ ఎయిర్ లైన్స్ కి చెందిన గ్లోబల్ 5000 బొంబార్డియర్ విమానం ఈ నెల 28 న డొమినికాలోని డే గ్లాస్ చార్లెస్ ఎయిర్ పోర్టుకు చేరుకుంది. అంతకుముందు రోజున ఈ ప్లేన్ దోహా నుంచి ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగినట్టు తెలిసింది. బహుశా చోక్సీ .ని డొమినికా నుంచి తీసుకురావడానికేనా లేక మరెవరినైనానా అన్న విషయం తెలియకుండా అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక సమాచారం అందాల్సి ఉంది. మెహుల్ చోక్సీ ప్రస్తుతం డొమినికా పోలీసుల అదుపులో ఉన్నాడు. తన నిర్బంధాన్ని సవాలు చేస్తూ ఆయన అక్కడి హైకోర్టుకెక్కాడు. అప్పీలు దాఖలు చేశాడు. తనను కిడ్నాప్ చేశారని, పోలీసులు కొట్టారని బలవంతంగా ఇక్కడికి తీసుకువచ్చారని ఆయన ఈ అప్పీలులో పేర్కొన్నాడు. ఇతడిని ఏ దేశానికైనా అప్పగించేందుకు కోర్టు ప్రస్తుతానికి నిరాకరిస్తోంది. జూన్ 2 న ఇతని అప్పీలుపై విచారణ జరపనుంది.

కాగా చోక్సి శరీరంపై గాయాలున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బహుశా ఇవి పోలీసులు కొట్టినవా లేక ఆయన తనకు తాను సొంతంగా చేసుకున్న గాయాలా అని నెటిజన్లు తర్జనభర్జన పడుతున్నారు. తన క్లయింటు ఇప్పుడు భారత పౌరుడే కాదని అందువల్ల అతడిని భారత్ కు అప్పగించే ప్రసక్తే తలెత్తదని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఈ కేసు ఎలా తేలుతుందో వేచి చూడాలి.

మరిన్ని ఇక్కడ చూడండి: Gold And Silver: స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు.. దేశంలోని ప్రధాన నగరాల్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి.. ( వీడియో )

Five Rupee Note: మీ దగ్గర ఈ లాంటి ఐదు రూపాయల నోట్లు ఉన్నాయా..? అయితే భారీగా సంపాదించుకోవచ్చు