కృష్ణపట్నంలో కరోనా పాజిటివ్ కేసులు.. వైద్య ఆరోగ్యశాఖ రాపిడ్ టెస్టుల్లో బయట పడిన వైనం.!
Krishnapatnam: కృష్ణపట్నం గ్రామంలో పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారీకి నిలయంగా ఉన్న కృష్ణపట్నం గ్రామ..
Krishnapatnam: కృష్ణపట్నం గ్రామంలో పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి. అయితే కరోనా వైరస్ నివారణకు నాటు వైద్యం తయారీకి నిలయంగా ఉన్న కృష్ణపట్నం గ్రామ పంచాయతీలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఈ గ్రామంలోని ప్రజలు తీవ్రంగా భయాందోళనకు గురవుతున్నారు. నాటు వైద్యం అందిస్తున్న ఆనందయ్య మందు ఇక్కడ తయారైన నేపథ్యంలో ఈ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. శనివారం కృష్ణపట్నం గ్రామ సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాపిడ్ టెస్ట్ లు నిర్వహించారు. ఆ శాఖ సిబ్బంది టెస్టు నిర్వహించగా ఒకే ఫ్యామిలీ లో ముగ్గురు కి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా ఉన్నట్లు వైద్య అధికారులు నిర్ధారించడం జరిగింది. ఐదుగురికి ఈ రాపిడ్ టెస్ట్ నిర్వహించగా ముగ్గురికి మాత్రం పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒక్కసారిగా కృష్ణపట్నం పేరు సంచలనం సృష్టించగా, ఇదే రీతిలో ఇక నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసులు సంచలనం కానున్నాయి. ఎక్కడెక్కడి నుంచో దూరప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి సుదీర్ఘ ప్రయాణం చేసి ఆయుర్వేదం వైద్యులుగా పిలవబడుతున్న ఆనందయ్య మందు కోసం ఇక్కడ జనం వస్తుంటే స్థానికంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతూ పాజిటివ్ కేసులు వస్తుండడంతో ఈ పరిణామం ఎక్కడికి దారి తీస్తుందోనని జనం భయపడిపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ నిర్వహించిన రాపిడ్ టెస్టుల్లో ఒక్కరోజులోనే మూడు కేసులు నమోదు చేయడంపై ఆ శాఖ అధికారులు ఆలోచనలో పడి మల్లగుల్లాలు పడుతున్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన కుటుంబంలో ఆనందయ్య వైద్యం పొందినట్లు తెలుస్తోంది.
కృష్ణపట్నం గ్రామంలో నాటు వైద్యం మందు పంపిణీ పక్రియలో సహకారం అందించిన వ్యక్తికి కరోనా వైరస్ సోకి పాజిటివ్ గా నిర్ధారణ కావడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతోంది. ఆయనతో పాటు ఆ కుటుంబంలోని భార్య పిల్లలకు ఈ వైరస్ సోకిన ట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మీడియాకు తెలిపారు. ఈ నేపథ్యంలో మందు పంపిణీ పక్రియలో పనిచేసిన వారందరికీ వైద్య ఆరోగ్య శాఖ కరోనా టెస్ట్ నిర్వహించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. నెల ముగిసే కొద్దీ కరోనా పాజిటివ్ కేసులు ఒక్కొక్కటి వెలుగులోకి రావడంతో గ్రామ పరిస్థితి ఏమవుతుందో అని గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. కచ్చితంగా అధికారులు రాపిడ్ టెస్ట్ నిర్వహించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా పాజిటివ్ సోకిన వ్యక్తి పది రోజుల క్రితం స్థానికంగా జరిగిన ఆనందయ్య మందులు పంపిణీ ఈ ప్రక్రియలో కరోనా పాజిటివ్ రోగులకు కంటిలో డ్రాప్స్ వేసి సేవా కార్యక్రమం చేసినట్లు తెలిసింది.
ఇవీ కూడా చదవండి