AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి

మొత్తానికి సమస్యలు, విపక్షాల ఆరోపణలు ఏవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా.. చెక్కుచెదరని ఆత్మ‌స్థైర్యంతో సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనను సాగించారు..

AP CM YS Jaganmohan Reddy : ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనకు నేటితో రెండేళ్లు పూర్తి
Ap Cm Ys Jagan
Venkata Narayana
|

Updated on: May 30, 2021 | 12:57 AM

Share

CM Jagan Two years ruling : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ పాలనా పగ్గాలు చేపట్టి ఇవాళ్టికి రెండేళ్లు పూర్తయింది. మొత్తానికి సమస్యలు, విపక్షాల ఆరోపణలు ఏవైనా, సంక్షోభాలు విరుచుకుపడుతున్నా.. చెక్కుచెదరని ఆత్మ‌స్థైర్యంతో సీఎం వైయస్‌ జగన్‌ రెండేళ్ల పాలనను సాగించారు. ప్రజా సంక్షేమమే పరమావధిగా భావించి, ఆ దిశలోనే, ఆ లక్ష్యసాధనే శ్వాసగా పనిచేసుకుపోతున్నారు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే గ్రామ, వార్డు సచివాలయాలు స్థాపించి.. గ్రామస్వరాజ్యానికి బాటలు వేశారు. గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా 4.5 లక్షల నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. 500 రకాల సేవలు అందించడం ద్వారా ప్రభుత్వ పాలనలో సరికొత్త విప్లవానికి నాంది పలికారు. పెన్షన్‌ మొదలు ఏ పథకమైనా నేడు గడప ముందుకొచ్చేలా పనిచేస్తున్నారు. రాష్ట్రంలో 11,152 గ్రామ సచివాలయాలు, 3,913 వార్డు సచివాలయాలు ఉన్నాయి. వీటిల్లో పనిచేసే లక్షల మంది ఉద్యోగులు ప్రభుత్వ లక్ష్యాన్ని సాధించడంలో వారధులవుతున్నారు. జగన్ సర్కారు రెండేళ్లు దిగ్విజయంగా పూర్తిచేసుకున్న నేపథ్యంలో ఆయన పాలనపై పుస్తకం రూపొందించారు. ఈ పుస్తకాన్ని సీఎం జగన్ ఆదివారం జరిగే ఓ కార్యక్రమంలో విడుదల చేయనున్నారు. ఈ పుస్తకం ద్వారా సీఎం జగన్ రెండేళ్ల పాలనలోని అంశాలను ప్రజలకు నివేదించనున్నారు. అమ్మఒడి, వలంటీర్ వ్యవస్థ, గ్రామ.. వార్డు సచివాలయాలు, ఇంటివద్దకే రేషన్ సరుకులు, ఆరోగ్యశ్రీ, కాపునేస్తం, వైఎస్సార్ రైతు భరోసా, వాహనమిత్ర, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, చేయూత వంటి కార్యక్రమాల గురించి ఈ పుస్తకంలో ప్రముఖంగా ప్రస్తావించినట్టు సమాచారం.

Read also : Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా