Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా

విపత్కర సమయంలో హైదరాబాద్‌కు పారిపోయిన తండ్రీకొడుకులు నిత్యం జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు..

Anil Kumar Yadav : జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడంటూ మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా
AP Minister Anil Kumar Yadav
Follow us
Venkata Narayana

|

Updated on: May 30, 2021 | 12:36 AM

AP minister Anil Kumar Yadav on Chandrababu : దివంగత నేత వైయస్‌ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన పోలవరం ప్రాజెక్టును.. ఆయన తనయుడు సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేస్తున్నారని ఇరిగేషన్‌ శాఖ మంత్రి డాక్టర్‌ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఆలస్యానికి చంద్రబాబే కారణమని ధ్వజమెత్తారు. జూమ్‌ పార్టీకి అధ్యక్షుడిగా చంద్రబాబు తయారయ్యాడని మంత్రి అనిల్‌ కుమార్‌ ఎద్దేవా చేశారు. జూమ్‌ ముఖ్యమంత్రిగా కొనసాగుతూ.. శేషజీవితం ప్రశాంతంగా కొనసాగాలని కోరుకుంటున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఆంధ్ర రాష్ట్రం సీఎం వైయస్‌ జగన్‌ చేతుల్లో పదిలంగా ఉందన్నారు. దాదాపు 80 శాతం మంది ప్రజలకు సంక్షేమాన్ని అందించారని, రేపు 16 మెడికల్‌ కాలేజీలకు సీఎం శంకుస్థాపన చేయబోతున్నారని వివరించారు. విపత్కర సమయంలో హైదరాబాద్‌కు పారిపోయిన తండ్రీకొడుకులు నిత్యం జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అడుగుపెట్టలేని దుస్థితిలోకి చంద్రబాబు వెళ్లిపోయాడన్నారు. ఆయన కొడుకు లోకేష్‌.. చిల్లర రాజకీయాలు చేసేందుకు ఏపీకి వస్తున్నాడన్నారు.

నెల్లూరులోని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయంలో మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్‌ శనివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆర్‌ అండ్‌ ఆర్‌ గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. తన పాలనలో నిర్వాసితులకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేని చంద్రబాబు ఆర్‌అండ్‌ఆర్‌ గురించి మాట్లాడటం సిగ్గుచేటన్నారు. పోలవరం, వెలుగొండ ప్రాజెక్టులను వైయస్‌ జగన్‌ పూర్తిచేస్తారని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తారన్నారు.

Read also : Ambati : ‘దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది.. అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం’ : అంబటి