Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ambati : ‘దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది.. అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం’ : అంబటి

ప్రజల నుంచి డైరెక్ట్‌గా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు చాలా అరుదు. ఆ ముఖ్యమంత్రికే ఓటు వేస్తున్నామని ప్రజలు చెప్పి మరీ ఓట్లు వేసి గెలిపించింది చాలా తక్కువ. వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, వారి తరువాత..

Ambati : 'దేశమంతా సీఎం వైయస్‌ జగన్‌ పాలన వైపు చూస్తోంది.. అన్నా..జగనన్నా అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం' : అంబటి
Ambati
Follow us
Venkata Narayana

|

Updated on: May 30, 2021 | 12:23 AM

YS Jagan Two years ruling : అన్నా.. జగనన్న..! అనే మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనమన్నారు వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు. ఎన్నికల మేనిఫెస్టోను ఓ పవిత్ర గ్రంథంగా భావించి ఇచ్చిన హామీల్లో రెండేళ్లకే 95 శాతం అమలు చేసి ప్రజల హృదయాల్లో సీఎం వైయస్‌ జగన్‌ చెరగని ముద్ర వేసుకున్నారని అంబటి అన్నారు. వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రెండేళ్ల పాలన దేశానికే ఆదర్శంగా మారిందని, అందరూ ఆయన వైపే చూస్తున్నారని పేర్కొన్నారు. కేవలం రెండేళ్లలోనే ప్రతిపక్షం కనిపించకుండా పోయిందని ఆయన చెప్పుకొచ్చారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి రెండేళ్లు పూర్తి అవుతున్న తరుణంలో ప్రజలంతా వైయస్‌ జగన్‌కు నీరాజనాలు పలుకుతున్నారని అంబటి అన్నారు. అయితే, కొవిడ్‌ కరాళా నృత్యం చేస్తున్న తరుణంలో ఇది సంబరాలకు, ఆడంబరాలకు సమయం కాదని, అందరం కలిసికట్టుగా కరోనా మహమ్మారిపై యుద్ధం చేయాల్సిన సమయమని.. అంబటి తాడేపల్లిలోని వైయస్‌ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

“రాష్ట్రంలో ఎంత మంది ముఖ్యమంత్రులను చూశాం.. ప్రజల నుంచి డైరెక్ట్‌గా అధికారంలోకి వచ్చిన వ్యక్తులు చాలా అరుదు. ఆ ముఖ్యమంత్రికే ఓటు వేస్తున్నామని ప్రజలు చెప్పి మరీ ఓట్లు వేసి గెలిపించింది చాలా తక్కువ. వారిలో టంగుటూరి ప్రకాశం పంతులు, ఎన్టీ రామారావు, డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి, వారి తరువాత నేరుగా ప్రజల నుంచి అధికారం పొందిన వ్యక్తి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి. అలాంటి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌. అన్నా..జగనన్న అన్న మాటకు ఈ రెండేళ్ల పాలనే నిదర్శనం.” అని అంబటి అన్నారు.

Read also : KCR : పంజాబ్ వంటి రాష్ట్రాల్లో నూటికి నూరు శాతం ధాన్యం సేకరిస్తున్న ఎఫ్ సీ ఐ.. తెలంగాణలో సేకరించకపోవడంపై సీఎం అసంతృప్తి