AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Police Attacks : పేకాట స్థావరాలపై గుంటూరు పోలీసుల దాడులు.. భారీగా సొమ్ము, కార్లు సీజ్

ఈ దాడిలో రూ. 42, 58, 420/- నగదును, ఒక నగదు లెక్కింపు యంత్రాన్ని, 27 బాక్సుల పేక ముక్కలను, 153 ప్లాస్టిక్ నాణేలను, 32 మొబైల్ ఫోన్లు, 22 కార్లు, 8 మోటార్ బైకులను..

Police Attacks : పేకాట స్థావరాలపై గుంటూరు పోలీసుల దాడులు.. భారీగా సొమ్ము, కార్లు సీజ్
Poker sites
Venkata Narayana
| Edited By: Team Veegam|

Updated on: May 29, 2021 | 7:29 PM

Share

Poker sites : గుంటూరు జిల్లా నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో నిర్వహిస్తున్న పేకాట శిబిరాలపై పోలీసులు ఇవాళ దాడులు నిర్వహించారు. భారీ మొత్తములో నగదు, కార్లు, మోటార్ వాహనాలు, సెల్ ఫోన్లు మొదలగు వాటిని స్వాధీనం చేసుకుని, పేకాట రాయుళ్లని అదుపులోకి తీసుకున్నారు. స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో SEB(Special Enforcement Bureau)పోలీసులు.. గుంటూరు రూరల్ పోలీసులు సంయుక్తంగా ఈ దాడులు నిర్వహించారు. చింతరేవు గ్రామానికి వెళ్ళే దారిలో నున్న భూశంకర్ రావు అనే వ్యక్తి యొక్క రొయ్యల చెరువు వద్ద గల ఒక షెడ్డులో నిర్వహిస్తోన్న పేకాట శిబిరంపై రేపల్లె టౌన్ సిఐ, నగరం SEB SI నేతృత్వంలో సంయుక్త దాడులు నిర్వహించి పేకాట (కోతముక్క) ఆడుతున్న 21 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ దాడిలో రూ. 42, 58, 420/- నగదును, ఒక నగదు లెక్కింపు యంత్రాన్ని, 27 బాక్సుల పేక ముక్కలను, 153 ప్లాస్టిక్ నాణేలను, 32 మొబైల్ ఫోన్లు, 22 కార్లు, 8 మోటార్ బైకులను, 10 కుర్చీలను, 3 టేబుళ్లను, 1- విద్యుత్ జనరేటర్ ను స్వాధీనం చేసుకుని వాటిని సీజ్ చేశారు.

అదే విధంగా నిజాంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని ముండ్రేడు గ్రాముములో మోపిదేవి నాగరాజు అనే వ్యక్తికి చెందిన రేకుల షెడ్డునందు నిర్వహిస్తున్న పేకాట(కోతముక్క) స్థావరంపై బాపట్ల రూరల్ సీఐ, నగరం SEB SI నేతృత్వంలోని బృందం దాడులు నిర్వహించి పేకాట ఆడుతున్న 58 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో రూ. 6, 17, 145/- నగదును, ఒక నగదు లెక్కింపు యంత్రాన్ని, 20 కార్లను, 16 మోటార్ బైకులను, 46 మొబైల్ ఫోన్లను, 1 ఆటో, 2 – జనరేటర్లను, 480 పేక ముక్కల బాక్సులను, 580 ప్లాస్టిక్ కుర్చీలు, 27 ప్లాస్టిక్ టేబుళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పేకాట వంటి చట్టవ్యతిరేక ఆటలు ఆడే వారే కాకుండా ఆడటానికి సహకరించడం, ఆడించడం, చూడడం, ఆట ఆడేవారికి కాపలా కాయడం వంటి చర్యలకు పాల్పడే వారిని కూడా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్టు క్రింద ముద్దాయిలు గా భావించి వారిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందని పోలీసులు తెలిపారు. కావున ప్రజలు ఇటువంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కోరారు. ఇలాంటి సమాచారం ఉంటే వెంటనే SEB కంట్రోల్ రూమ్ నంబర్ 9490619395 కు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని పోలీస్ అధికారులు గుంటూరు జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read aslo : Fake News Alert : కొండాపూర్ ప్రాంతంలో పోలీస్ సిబ్బందిపై దాడి జరగలేదు.. వైరల్ వీడియోపై పోలీసుల వివరణ

కోవిడ్-19తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల కోసం కేంద్రం కొత్త పథకం.. పీఎం కేర్స్​ నుంచి రూ.10 లక్షలు.. ఇంకా

రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్‌ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!

గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…