AP Corona Updates: ఆంధ్రప్రదేశ్‌లో కాస్త తగ్గుముఖం పడుతోన్న కరోనా కేసులు.. మరణాలు మాత్రం..
AP Corona Updates: లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్యలో కాస్త తగ్గుముఖం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి...
AP Corona Updates: లాక్‌డౌన్ అమల్లోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కేసులు సంఖ్యలో కాస్త తగ్గుముఖం కనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఆంధ్ర్రదేశ్ విషయానికొస్తే.. గడిచిన 24 గంటల్లో పాజిటివ్ రేటు 25 శాతం నుంచి 17 శాతానికి తగ్గింది. ఆంధ్ర్రప్రదేశ్‌లో శుక్రవారం ఉదయం 9.00 గంటల నుంచి రాత్రి 9.00 గంటల వరకు మొత్తం 79564 నమూనాలను పరీక్షించగా 13,756 పాజిటివ్ కేసులుగా నమోదయ్యాయి. ఈ లెక్కన పాజిటివ్ రేటు 17 శాతం తక్కువగా నమోదైంది. అయితే కరోనా కేసులు తగ్గుతున్నాయని సంతోషించినా.. మరణాల సంఖ్య మాత్రం ఇంకా భాయందోళనకు గురి చేస్తూనే ఉంది. రాష్ట్రంలో 24 గంటల్లో కరోనా కారణంగా 104 మరణాలు సంభవించాయి. రాష్ట్రంలో అధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 20 మంది మరణించగా.. చిత్తూరులో అత్యధికంగా 2301 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 173622 యాక్టివ్ కేసులు ఉండగా.. ఇప్పటి వరకు 10738 మంది మరణించారు. ఇక రాష్ట్రంలో రివకరి రేటు కూడా ఆశాజనకంగానే కనిపిస్తోంది. మొత్తం 16.71లక్షల కరోనా బాధితుల్లో 14.87 లక్షల మంది కోలుకున్నారు.
అప్రమత్తం చేస్తోన్న అధికారులు..
రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోన్న దృష్ట్యా.. అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళవద్దని, వెళ్లినా తప్పక మాస్కులు ధరింలాచని, భౌతిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. జాగ్రత్తగా ఉంటూ కుటుంబాన్ని కాపాడుకోవాలని కోరారు. లేదంటే కుటుంబం మొత్తం ఆసుపత్రి పాలయ్యే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నారు. లాక్‌డౌన్ విధిగా పాటించడం వల్ల కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయని, ఇలాగే జాగ్రత్తగా ఉంటే కరోనాపై విజయం మనదే అవుతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: TGCET 2021: కరోనా పరిస్థితుల నేపథ్యంలో టీజీ సెట్ వాయిదా… పూర్తి వివరాలు