Allu Sirish Anu: అల్లువారి అబ్బాయి అస్సలు తగ్గట్లేదుగా… రొమాంటిక్ లుక్ విడుదల.. రేపు కొత్త సినిమా టైటిల్..
Allu Sirish Anu: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శిరీష్ 6వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 'విజేత', 'జతకలిసే' ఫేమ్ రాకేష్ శశి...
Allu Sirish Anu: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంటగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. శిరీష్ 6వ చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శిరీష్ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో సందడి చేయనున్నాడు. ఇక గత చిత్రాల్లో ఎన్నడూ లేని విధంగా శిరీష్ ఇందులో తనలోని రొమాంటిక్ యాంగిల్‌ను చూపించనున్నాడు. తాజాగా శిరీష్ ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఓ పొటోనే దీనికి నిదర్శనంగా కనిపిస్తోంది. రేపు (ఆదివారం) అల్లు శిరీష్ పుట్టిన రోజు. ఈ సందర్భంగా తన కొత్త సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ప్రకటిస్తూ.. శిరీష్ సినిమా ప్రీలుక్ ఫొటోను షేర్ చేశాడు. ఇందులో శిరీష్ హీరోయిన్‌తో కాస్త రొమాన్స్ డోస్‌ను పెంచినట్లు కనిపిస్తోంది. దీంతో ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే ఈ సినిమాపై ఆసక్తి పెరగడానికి మరో అంశం కూడా కారణంగా చెప్పవచ్చు. అదే శిరీష్.. అనుతో డేటింగ్‌లో ఉన్నాడనే వార్త. అల్లు శిరీష్, హీరోయిన్ అను ఇమ్మాన్యుల్‌తో కొన్ని రోజులుగా డేటింగ్‌లో ఉన్నాడని.. త్వరలోనే ఈ జంట పెళ్లి పీఠలెక్కనుందని వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఇటు శిరీష్ కానీ, అటు అను కానీ స్పందించలేరు. మరి ఈ సినిమా విడుదల వరకైనా దీనిపై ఏదైనా క్లారిటీ వస్తుందో చూడాలి.
శిరీష్ పోస్ట్ చేసిన ప్రీలుక్ ఫొటో..
Here’s our second prelook. Excited to share the title & first look our film tomorrow at 11am. #sirish6 @GA2Official @ItsAnuEmmanuel #rakeshsashii pic.twitter.com/7nKTuiyJNJ
— Allu Sirish (@AlluSirish) May 29, 2021