AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Renu Desai: పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్… ఇప్పుడు ఇవ్వను.. అప్పుడే ఇస్తా.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్..

Renu Desai: దేశంలో కరోనా సృష్టిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు వీలైనంత సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్..

Renu Desai: పర్సనల్ నంబర్ అడిగిన నెటిజన్... ఇప్పుడు ఇవ్వను.. అప్పుడే ఇస్తా.. రేణు దేశాయ్ స్ట్రాంగ్ ఆన్సర్..
Renu Desai
Rajitha Chanti
|

Updated on: May 29, 2021 | 5:22 PM

Share

Renu Desai: దేశంలో కరోనా సృష్టిస్తున్న సమయంలో సినీ ప్రముఖులు వీలైనంత సాయాన్ని అందిస్తున్నారు. ఈ క్రమంలోనే నటి రేణు దేశాయ్.. కూడా కరోనా రోగులకు చికిత్సకు కావాల్సిన సహాయాన్ని అందిస్తున్నారు. ఇందుకోసం రేణూ దేశాయ్ గత పదిహేను రోజుల క్రితం తన ఇన్ స్టాగ్రాంలోని ఇన్ బాక్స్‌ను ఓపెన్ చేసిపెట్టారు. అవసరం ఉన్న వారు మెసెజ్ చేయండని రేణూ దేశాయ్ కోరారు. దీంతో కొందరు ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. అవసరం ఉన్నవారు కంటే ఎక్కువగా కొంతమంది హాయ్, హాలో అంటూ మెసేజ్ లు చేస్తున్నారు. గతంలో ఇలాంటి సందేశాలపై గతంలో రేణు దేశాయ్ ఘాటుగానే స్పందించారు. అలాంటి మెసేజ్ లు చేయడం వలన అవతల వేరేవాళ్ళ ప్రాణాలు పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదిలా ఉంటే.. ఇటీవల కొందరు సాయం పేరిట డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. డబ్బులు ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించారు. ఇలాంటి సందేశాలతో విసుగెత్తిపోయిన రేణూ దేశాయ్ తన ఇన్ స్టాగ్రాం అకౌంట్‌లోని ఇన్ బాక్స్‌ను మూసి వేస్తున్నట్టు ప్రకటించారు. నిన్న సాయంత్రం ఇన్ స్టాలో లైవ్‌లోకి వచ్చి ఈ విషయాన్ని ప్రకటించారు. ఇక నుంచి ఏ అవసరం ఉన్నా కూడా కామెంట్ల రూపంలో తెలపండని కోరారు. అది కూడా డబ్బుల రూపంలో అయితే తాను సాయం చేయనని, ఆహారం, నిత్యావసర సరుకులు, చిన్న మొత్తంలో దొరికే మందులు అయితేనే తాను సమకూర్చగలనని అన్నారు. ఆ మేరకు తాను గ్యారంటీ ఇస్తానని రేణూ దేశాయ్ అన్నారు. అలా రేణు దేశాయ్ లైవ్ లో మాట్లాడుతూ ఉండగానే.. మరో నెటిజన్ పర్సనల్ నంబర్ ఇవ్వండి అంటూ అడిగేశాడు. ఈ కామెంట్ కు రేణు దేశాయ్ ధీటుగానే స్పందించారు. ఇప్పుడు తన పర్సనల్ నంబర్ ఇవ్వలేనని.. ఒకవేళ తాను ఎన్జీవో ప్రారంభిస్తే.. ఆ నంబర్ ఇస్తా అంటూ చెప్పుకోచ్చారు.

Also Read: World Digestive Health Day- 2021 : నేడు ప్రపంచ డైజెస్టివ్ హెల్త్ డే.. ఈ రోజు ప్రాముఖ్యత.. జీర్ణ వ్యాధుల కారణాలు నివారణలు..?

Dark Circles : కళ్లకింద నల్లటి ముడతలతో ఇబ్బందిగా ఉందా..? అయితే ఈ పద్దతులు పాటించి సింపుల్‌గా తొలగించుకోండి..

యాజమానులు చేసిన పనికి షాక్ తిన్న కుక్కపిల్ల.. పాపం.. అక్కడే అలా.. నవ్వులు పూయిస్తున్న Viral Video