AP Rains Updates: ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో వివిధ ప్రాంతాల్లో వర్షాలు: వాతావరణ శాఖ
AP Rains Updates: నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి కొనసాగుతూనే ఉంది మే 31 2021 న కేరళపై నైరుతి రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం..
AP Weather Update: నైరుతి రుతుపవనాల ఉత్తర పరిమితి కొనసాగుతూనే ఉంది. మే 31న కేరళపై నైరుతి రుతుపవనాల ప్రారంభానికి పరిస్థితులు అనుకూలంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు పరిసరాల పై గల ఉపరితల ఆవర్తనం నుండి ఒక ద్రోణి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కి.మీ ఎత్తు వద్ద కొనసాగుతున్నది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది. శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. అలాగే ఎల్లుండి ఉత్తర కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, అక్కడక్కడ భారీగా వర్ష సూచన ఉండే అవకాశం ఉందని తెలిపింది.
దక్షిణ కోస్తా ఆంధ్ర :
ఈ రోజు, రేపు దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉందని, ఎల్లుండి దక్షిణ కోస్తాఆంధ్రాలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉంది.
రాయలసీమ:
ఇక రాయలసీమ ప్రాంతంలో ఈ రోజు, రేపు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండుచోట్ల కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి రాయలసీమలో ఉరుములు, మెరుపులుతో పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని ఏపీ వాతావరణ కేంద్రం తెలిపింది.
Read Also: Chittoor Lockdown: చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్ మరింత కఠినతరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Lockdown Extension: జూన్ 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగింపు.. సరుకులు ఇంటి వద్దకు చేర్చేందుకు అనుమతి
రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం.. పీఎం కిసాన్ పథకంలో చేరేందుకు చివరి తేదీ ఎప్పుడంటే..!
గాలిలో ఎగురుతూన్న డేగపై చేప దాడి చేసింది… ఈ వీడియో చూస్తే ఆశ్చర్యపోతారు…