Chittoor Lockdown: చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

Chittoor Lockdown: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత..

Chittoor Lockdown: చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ మరింత కఠినతరం: మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
Minister Peddireddy Ramachandra Reddy
Follow us
Subhash Goud

|

Updated on: May 29, 2021 | 2:18 PM

Chittoor Lockdown: ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్రంలో లాక్‌డౌన్‌ ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇక చిత్తూరు జిల్లాలో లాక్‌డౌన్‌ ఆంక్షలు మరింత కఠినతరంగా అమలు చేయనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు సరుకులు కొనుగోలు చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జూన్‌ 1 నుంచి జిల్లాలో ఉదయం 10 నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందన్నారు. చిత్తూరు జిల్లాలో కరోనాను కట్టడి చేసేందుకు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. జిల్లాలో నిన్న ఒక్క రోజే కొత్తగా 2291 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, 15 మంది మరణించారు. ఇప్పటి వరకు ఆ జిల్లాలో 1.85 లక్షల మందికి కరోనా బారిన పడగా, వీరిలో 1.63 లక్షల మందికిపైగా కోలుకున్నారు. ఇక 1254 మంది మృతి చెందారు.

ఇవీ కూడా చదవండి:

Lockdown extension: జూన్‌ 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు.. సరుకులు ఇంటి వద్దకు చేర్చేందుకు అనుమతి

Special Task Force: పిల్లల్లో కోవిడ్‌ చికిత్స విధానానికి 8 మందితో కూడిన స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌