AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Corona Hybrid: క‌రోనా ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదుగా.. మ‌రో కొత్త వేరియంట్‌ గుర్తింపు.. గ‌త వాటితో పోలీస్తే మ‌రీ డేంజ‌ర్‌..

Corona Hybrid: ఏ క్ష‌ణాన చైనాలోని వూహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్‌ను గుర్తించారో ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌పంచానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్ర‌పంచ దేశాలు ఈ మ‌హ‌మ్మారి దాటికి త‌ట్టుకోలేకపోతున్నాయి...

Corona Hybrid: క‌రోనా ఇప్ప‌ట్లో వ‌దిలేలా లేదుగా.. మ‌రో కొత్త వేరియంట్‌ గుర్తింపు.. గ‌త వాటితో పోలీస్తే మ‌రీ డేంజ‌ర్‌..
Hybrid Corona
Narender Vaitla
|

Updated on: May 30, 2021 | 8:21 AM

Share

Corona Hybrid: ఏ క్ష‌ణాన చైనాలోని వూహాన్ న‌గ‌రంలో క‌రోనా వైర‌స్‌ను గుర్తించారో ఆ రోజు నుంచి నేటి వ‌ర‌కు ప్ర‌పంచానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ప్ర‌పంచ దేశాలు ఈ మ‌హ‌మ్మారి దాటికి త‌ట్టుకోలేకపోతున్నాయి. రోజుకో కొత్త వేరియెంట్‌తో అగ్ర‌దేశాల‌ను సైతం గ‌డ‌గ‌డ‌లాడిస్తోందీ వైర‌స్. ఇక ఇప్పుడిప్పుడే క‌రోనా తీవ్ర‌త త‌గ్గుతోంద‌ని సంతోషిస్తున్న వేళ మ‌రో కొత్త వేరియంట్ భ‌య‌పెట్టిస్తోంది. తాజాగా ప‌రిశోధకులు వియ‌త్నంలో కొత్త‌గా హైబ్రిడ్ క‌రోనా వైర‌స్‌ను గుర్తించారు. ఈ కొత్త వేరియంట్ గ‌త వేరియంట్‌ల‌ను మించి విస్త‌రిస్తున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. సాధార‌ణంగా మొద‌ట వ‌చ్చిన వైర‌స్‌ల‌తో పోల్చితే మార్పు చెందిన వేరియెంట్లు మ‌రింత ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. ఇలా రూపు మార్చుకున్న రెండు ప్రమాదకర వేరియంట్ల నుంచి ఇప్పుడు అ‍త్యంత ప్రమాదకరమైన సంకర జాతి కరోనా వైరస్‌ పుట్టుకొచ్చింది. భార‌త్‌, బ్రిట‌న్‌ల‌లో క‌రోనా ఉగ్ర‌రూపానికి కార‌ణ‌మైన మ్యూటెంట్ల ల‌క్ష‌ణాల‌తో ఈ కొత్త హైబ్రిడ్ వైర‌స్ పుట్టుకొచ్చిన‌ట్లు వియ‌త్నాం హెల్త్‌ మినిష్టర్‌ న్యూయెన్‌ థాన్‌ ప్రకటించారు. ఇప్ప‌టికే దేశంలోని ప‌లున‌గ‌రాల్లో ఈ కొత్త వేరియంట్ కేసులు న‌మోదైన‌ట్లు శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. ఈ హైబ్రిడ్‌వేరియంట్‌కి సంబంధించిన సమాచారం త్వరలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేస్తామని వియత్నాం వైద్య నిపుణులు చెబుతున్నారు. మ‌రి ఈ కొత్త మ్యుటెంట్ మ‌ళ్లీ ప్ర‌పంచానికి ఎలాంటి స‌వాల్ విసురుతుందో చూడాలి.

Also Read: Vaccination: ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 21 కోట్ల టీకాలు వేశారు.. అత్యధికంగా మహారాష్ట్రలో వ్యాక్సినేషన్..

రండీ ఎంజాయ్ చేయండి..! సందర్శకులకు స్వాగతం పలికిన మధ్యప్రదేశ్ సర్కార్..

తెలంగాణ సర్కర్ కీలక నిర్ణయం.. మ‌రో ఐదు ఆస్ప‌త్రుల అనుమ‌తులు ర‌ద్దు

సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
సంతోషకరమైన జీవితానికి రాజమార్గం! బుద్ధుడు చెప్పిన సీక్రెట్ ఇదే
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌