AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రధాని మోదీ ఓ ‘ఈవెంట్ మేనేజర్’…, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, … ‘మన్ కీ బాత్’ అర్థ రహితమని విమర్శ

ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత ఓ 'ఈవెంట్; మేనేజర్' గా అభివర్ణించారు. కోవిద్-19 పాండమిక్ ను హ్యాండిల్ చేయడానికి ఆయన ఓ సమగ్ర వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు.

ప్రధాని మోదీ ఓ 'ఈవెంట్ మేనేజర్'..., కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫైర్, ... 'మన్ కీ బాత్'  అర్థ రహితమని విమర్శ
Rahul Gandhi
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: May 30, 2021 | 1:33 PM

Share

ప్రధాని మోదీని కాంగ్రెస్ నేత ఓ ‘ఈవెంట్; మేనేజర్’ గా అభివర్ణించారు. కోవిద్-19 పాండమిక్ ను హ్యాండిల్ చేయడానికి ఆయన ఓ సమగ్ర వ్యూహాన్ని రూపొందించడంలో విఫలమయ్యారని రాహుల్ ఆరోపించారు. దేశంలో వ్యాక్సినేషన్ డ్రైవ్ విషయంలో ఈ ప్రభుత్వానికి స్ట్రాటజీ అంటూ లేదని, ఈ ప్రధాన మంత్రికి వ్యూహాత్మక ధోరణి అంతకన్నా లేదని విమర్శించారు., ఆదివారం మోదీ నిర్వహిస్తున్న ‘మన్ కీ బాత్’ ని రాహుల్..అర్థరహితమైనదిగా పేర్కొన్నారు. ఒక సమయంలో మోదీ ఇలాంటి ‘ఈవెంట్; గురించి యోచిస్తారని, హఠాత్తుగా అది జరగాలని నిర్ణయిస్తారని, కానీ మనకు ఇప్పుడు ఈవెంట్లు అక్కరలేదని అన్నారు. ఇవి ప్రజలను చంపడానికే అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ఆదివారం ఆయన వర్చ్యువల్ గా మీడియాతో మాట్లాడుతూ..దేశంలో కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించాలని, లేని పక్షంలో ఎంత అవకాశం ఇస్తే అది అంత వేగంగా విస్తరిస్తుందని హెచ్చరించారు. ఇండియాలో సెకండ్ కోవిద్ వేవ్ ప్రబలడానికి ఈ ప్రధాన మంత్రే కారణమని ఆయన ఆరోపించారు. వ్యాక్సినేషన్ ఇలాగే మందకొడిగా సాగితే.. మొత్తం దేశానికంతటికీ ఇది 2024 మే నెల నాటికి పూర్తి అయినా ఆశ్చర్యం లేదన్నారు. ఇదే ధోరణి కొనసాగితే దేశంలో ఎన్నో వైరస్ వేవ్ లు వ్యాపిస్తాయని రాహుల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే మనం సెకండ్ వేవ్ ని చూశామని, మూడో వేవ్ రాబోతోందని అంటున్నారని ఆయన చెప్పారు.

కరోనా వైరస్ కేసులు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెబుతోందని, కానీ ఇవి అసలైన లెక్కలా అని అనుమానం వస్తోందన్నారు. ఇటీవల న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన వార్త నిజమా -కాదా అని వ్యాఖ్యానించారు. ఈ విషయంలో ఆయా దేశాలకు మనం ఖచ్చితమైన సమాధానం ఇచ్చి తీరాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Zodiac Sign: మీరు ఇష్టపడిన వ్యక్తి మీకు ‘ఐ లవ్యూ’ అని ఎంత త్వరగా చెబుతారో ఆ వ్యక్తి ‘రాశి’ చెబుతుంది తెలుసా?

TANA Election Live: అమెరికాలో ముగిసిన తానా ఎన్నికల కౌంటింగ్‌.. అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్‌