TANA Election Result Highlights: అమెరికాలో ‘తానా’ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించిన శృంగవరపు నిరంజన్ ప్యానెల్
America TANA Election: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు..
America TANA Election: ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్రభంజనం సృష్టించారు. తానా అధ్యక్షుడు బాధ్యతలు చేపట్టనున్నారు. అయితే 2021 ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థిగా బరిలో నిలిచిన కర్నూలు జిల్లాకు చెందిన శృంగవరపు నిరంజన్ విజయాన్ని అందుకున్నారు. తన సమీప ప్రత్యర్థి నరేన్ కొడాలిపై 1758 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నిరంజన్‌కు 10866 ఓట్లు లభించగా, నరేన్‌కు 9108 ఓట్లు లభించాయి. తానా ఎన్నికల్లో గెలుపొందడంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు చేసుకుంటోంది.
కొడాలి ఓడాలి అంటూ కాళ్లరిగేలా అమెరికా అంతటా చేసిన ప్రచారం ఎట్టకేలకు ఫలించింది. తానాలో సమూల మార్పులు తీసుకురాగల శక్తి ఉందని రుజువైంది. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ కార్యవర్గ పదవులు అన్నింటినీ కైవసం చేసుకుని చరిత్ర సృష్టించింది. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉండగా, పోలైన ఓట్లు 21 వేలు ఉన్నాయి. ఇక ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లు గుర్తించారు. శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ అయితే ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్, నరేన్ కొడాలి ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
LIVE NEWS & UPDATES
-
తానాలో గెలుపొందిన వారిలో..
-బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ గా జనార్దన్ నిమ్మలపుడి నాగేంద్ర శ్రీనివాస్ కోడలి
– న్యూజెర్సీ రీజినల్ కోఆర్డినేటర్‌గా వంశీ వాసిరెడ్డి
– డల్లాస్ ఫోర్ట్‌వర్త్ రీజినల్ కోఆర్డినేటర్‌గా సతీష్ కొమ్మన
-నార్త్ సెంట్రల్ – సాయి బొల్లినేని
-న్యూ ఇంగ్లాండ్ రీజినల్ కోఆర్డినేటర్- ప్రదీప్ గడ్డం
-మిడ్ అట్లాంటిక్ – సునీల్ కొగంటి
-మిడ్‌వెస్ట్- హనుమాన్ చెరుకూరి
-న్యూజెర్సీ ప్రాంతీయ సమన్వయకర్త సతీష్ కొమ్మన గెలుపొందారు
-
గల్లీ యువకుడు గెలిచాడు
అమెరికా తానా 2021 ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ ప్యానెల్ విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో కోశాధికారిగా కొల్లా అశోక్‌బాబు ప్రత్యర్థి జగదీష్ ప్రభలపై 1920 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే అశోక్‌కు 11460 ఓట్లు లభించగా, జగదీష్‌కు 9540 ఓట్లు లభించాయి. తానా ప్రతి పైసాకు పారదర్శకత ఉండేలా దాని విలువ పెంచేలా చర్యలు చేపడతానని నిరంజన్ ప్యానెల్ నుండి బరిలో దిగిన అశోక్ విజయం సాధించారు. తానాకు అసలైన కార్యకర్తనని నిరూపించుకున్నారు. ప్రకాశం జిల్లా కొల్లావారిపాలెంకు చెందిన అశోక్ ప్రస్తుతం ఒహాయోలో నివసిస్తున్నారు. నరేన్ ప్యానెల్ నుండి పోటీ చేసిన ఆయన ప్రత్యర్థి ప్రభల జగదీష్ కూడా ఒహాయోలోనే నివసిస్తున్నారు.
-
-
సంబరాల్లో నిరంజన్ ప్యానెల్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్, నరేన్ కొడాలిల మధ్య పోటీ నెలకొనగా, నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. ఇక నిరంజన్ గెలుపును అధికారికంగా ప్రకటించారు. దీంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు జరుపుకొంటున్నారు.
-
తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్
అమెరికాలో తానా ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో తానా అధ్యక్షుడిగా శృంగవరపు నిరంజన్ విజయం సాధించారు. నిరంజన్‌కు 10,866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9,108 ఓట్లు వచ్చాయి. ఇక నిరంజన్ గెలుపును అధికారికంగా ప్రకటించారు అధికారులు. దీంతో నిరంజన్ ప్యానెల్ సంబరాలు చేసుకుంటున్నారు.
-
నిరంజన్ ప్యానెల్ సంబరాలు
అమెరికాలో తానా ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు తర్వాత శృంగవరపు నిరంజన్ గెలుపుతో నిరంజన్ ప్యానెల్ సభ్యులు సంబరాలు చేసుకుంటున్నారు.
-
-
నిరంజన్‌కు 10866 ఓట్లు
అమెరికా తానా ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఈ ఎన్నికల్లో శృంగవరపు నిరంజన్ గెలుపొందారు. ఇక శృంగవరపు నిరంజన్‌కు 10866 ఓట్లు రాగా, నరేన్ కొడాలికి 9108 ఓట్లు సాధించారు. ఇక ప్రస్తుత అధ్యక్షుడు జే తల్లూరి, అంజయ్య చౌదరి 1758 ఓట్లు నిరంజన్ ప్యానెల్ మద్దతు ఇచ్చారు.
-
పూర్తయిన తానా ఎన్నిలక కౌంటింగ్… నిరంజన్ గెలుపు..! కొద్ది సేపట్ల అధికారిక ప్రకటన
అమెరికా తానా ఎన్నికల కౌంటింగ్ పూర్తయింది. ఈ ఎన్నికల్లో నిరంజన్ ప్యానెల్ విజయం సాధించగా, అయితే అధికారికంగా కొద్ది సేపట్లో ప్రకటించనున్నారు
-
‘తానా’ కౌంటింగ్లో దూసుకుపోతున్న నిరంజన్ ప్యానెల్
అమెరికాలో తానా ఎన్నికల ఓట్ల లెక్కింపు రసవత్తరంగా కొనసాగుతోంది. శృంగవరపు నిరంజన్ – నరేన్ కొడాలిల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కౌంటింగ్ ప్రక్రియ రసవత్తరంగా కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో నిరంజన్ గెలిచే అవకాశాలున్నాయి. సుమారు మూడు వేల పైగా మెజార్టీతో గెలుస్తామని నిరంజన్ ప్యానెల్ చెబుతోంది.
-
పరిశీలకుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ
అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. శృంగవరపు నిరంజన్‌కు యతాళ్లూరి, అంజయ్య చౌదరిలు మద్దతు తెలుపుతున్నారు. ఇక నరేన్ కొడాలికి మద్దతుగా తానా మాజీ అధ్యక్షుడు జయరాం కోమటి, సతీష్ వేమున ఉన్నారు. పరిశీలకుల సమక్షంలో ఈ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.
-
శృంగవరపు నిరంజన్ ప్యానెట్ – నరేన్ కొడాలి మధ్య తీవ్ర పోటీ
అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. శృంగవరపు నిరంజన్ ప్యానెల్, నరేన్ కొడాలి ప్యానెల్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. పోస్టల్ బ్యాలెట్ల ద్వారా ఎన్నికల ప్రక్రియ కొనసాగింది. దీంతో అమెరికాలో తెలుగోళ్ల మద్దతు ఎవరికి ఉంటుందనేది కొన్ని గంటల్లో తెలిసిపోనుంది.
-
పోస్టల్ బ్యాలెట్లు
అమెరికా తానా 2021 ఎన్నికల సందర్బాంగా ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొత్తం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల సంఖ్య 33,875. ఒక కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ బ్యాలెట్‌కు కలిపి కవరు ఉంటుంది. అలా అధికారికంగా బయటకు వెళ్లిన కవర్ల సంఖ్య 17758. కానీ ఎలక్షన్ కమిటీకి వచ్చిన కవర్ల సంఖ్య 10877 ఉన్నట్లు సమాచారం. ఇక చిరునామా సరిగా లేని కవర్ల సంఖ్య 1433. ఇక మొత్తం కలిసి 12,310 కవర్లు రాగా, రాని కవర్ల సంఖ్య 5448 ఉన్నట్లు తెలుస్తోంది.
-
ఇప్పటి వరకు 20 వేల ఓట్లు స్కానింగ్
అమెరికాలో తానా ఎన్నికల ఓట్ల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 20 వేల ఓట్లను స్కాన్ చేసినట్లు పోటీదారుడు నిరంజన్ తరపున సభ్యులు చెబుతున్నారు. ఈ తానా ఎన్నికల్లో నిరంజన్ గెలుపొందే అవకాశం ఉంది. ప్రస్తుతం మెజార్టీ ఓట్లు వస్తున్నాయి. ఇదే ట్రెండ్ కొనసాగితే నిరంజన్ సభ్యులంతా గెలుపొందే అవకాశం ఉంటుంది అని తెలిపారు.
-
తానా ఎన్నికల కౌంటింగ్
అమెరికాలోని సియాటెల్‌లో జరుగుతున్న తానా 2021 ఎన్నికల్లో 10877 బ్యాలెట్ కవర్లను తెరిచే ఘట్టం ముగిసింది. బ్యాలెట్ కవర్‌ను, బ్యాలెట్‌ను సరిచూసే ప్రక్రియ కూడా ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి కేవలం ఒకే మెషీన్‌పై బ్యాలెట్లను లెక్కబెడుతున్నారు.
-
మొత్తం ఓట్లు 33,875
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికలకు కౌంటింగ్ కొనసాగుతోంది. తానా ఎన్నికల్లో మొత్తం ఓట్లు 33,875 ఉండగా, పోలైన ఓట్లు 21 వేలు ఉన్నాయి. ఇక ఇక చెల్లని ఓట్లు 2,800 ఉన్నట్లు గుర్తించారు.
-
సాయంత్రం వరకు ఫలితాలు
తానా ఎన్నికల కౌంటింగ్‌లో ముందుగా పోస్టల్ బ్యాలెట్‌లను తీసుకువచ్చి లెక్కిస్తారు. బ్యాలెట్లపై బార్‌కోడ్లను సరి చూసుకుంటారు. అనంతరం మెషీన్ల సహకారంతో బ్యాలెట్‌లను తెరిచి ఓట్లను లెక్కిస్తున్నారు. సాయంత్రం వరకు ఫలితాలు రానున్నాయి.
-
మొత్తం లైవ్ ఓట్లు 408
తానా ఎన్నికల కౌంటింగ్‌లో భాగంగా మొత్తం 408 లైవ్ ఓట్లు ఉండగా, నిరంజన్ ప్యానెల్‌కు 233, నరేన్ కొడాలి ప్యానెల్ కు 175 ఓట్లు.
-
ఎలక్షన్ ట్రస్ట్ కార్యాలయంలో కౌంటింగ్
అమెరికాలో తానా ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో తుది ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. స్థానిక ఎలక్షన్ ట్రస్ట్ కార్యాలయంలో కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్‌లో పాల్గొనేందుకు నలుమూలల నుంచి అధ్యక్షులు నరేన్, నిరంజన్, శ్రీ నవాసులతో పాటు వారి మద్దతు దారులు, ఇతర పోటీదారులు సియాటెల్‌కు చేరుకున్నారు
-
కొనసాగుతున్న తానా ఎన్నికల కౌంటింగ్
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మరి కొన్ని గంటల్లో ఫలితాలు రానున్నాయి. ఈ ఎన్నికల్లో
Published On - May 30,2021 2:38 PM