ఇంటి చూరు నుంచి వేలాడుతున్న పాములు…రోజూ నరకం !, అద్దె ఇంట్లో అంతా భయం…భయం…ఎక్కడంటే !?

అమెరికా అంటే భూతల స్వర్గమని, అక్కడ ధనవంతులే తప్ప సామాన్యులు ఉండరని, పైగా ఇళ్ళు సిరిసంపదలతో తులతూగుతుంటాయని అంతా అనుకుంటాం.. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే అంటున్నారు..

ఇంటి చూరు నుంచి వేలాడుతున్న పాములు...రోజూ నరకం !, అద్దె ఇంట్లో అంతా  భయం...భయం...ఎక్కడంటే  !?
Snakes fall through ceiling of family rented house
Umakanth Rao

| Edited By: Anil kumar poka

May 30, 2021 | 4:13 PM

అమెరికా అంటే భూతల స్వర్గమని, అక్కడ ధనవంతులే తప్ప సామాన్యులు ఉండరని, పైగా ఇళ్ళు సిరిసంపదలతో తులతూగుతుంటాయని అంతా అనుకుంటాం.. కానీ అలా అనుకుంటే తప్పులో కాలేసినట్టే అంటున్నారు. ఉదాహరణకు జార్జియాలోని ఓ ఇంటికి వెళ్తా అక్కడి పరిస్థితి చూసి నోరెళ్లబెట్టాల్సిందే.. ఈ ఇంట్లో హేరీ పగ్లీస్ అనే వ్యక్తి తన భార్య, కూతురుతో అద్దెకు ఉంటున్నాడు. అయితే నిత్యం ఈ ఇంటి సీలింగ్ పైనుంచి పాములు వేలాడుతుంటాయి. వర్షానికి తడిసిన సీలింగ్ పెచ్చులు ఊడిపోయి ఆ రంధ్రాల నుంచి ఇవి కిందికి జారి వచ్చేస్తుంటాయిట. ఇక ఎలుకలు, బొద్దింకలు సరేసరి !హేరీ దినదిన గండంగా తన కుటుంబంతో ఈ ఇంట్లో గడుపుతున్నాడు. వీటి బెడద గురించి ఇంటి యజమానురాలికి చెబితే..ఉంటే ఉండడని లేదా ఖాళీ చేయండని దబాయిస్తోందట. నేను మాత్రం ఇంటి మరమ్మతులు చేయించనని ఖరాఖండిగా చెబుతోందని ఆయన బావురుమంటున్నాడు. తన దీన స్థితిని గురించి ఎనిమల్ కంట్రోల్ వారికి ఫిర్యాదు చేస్తే..వాళ్ళు ఆ యజమానురాలి దగ్గరకు వెళ్లారు. అయితే వారిని చూడగానే ఆమె గయ్యిమని ఇంతెత్తున ఎగిరిపడి.. హేరీ కుటుంబం రెండు నెలలుగా అద్దె చెల్లించడం లేదని, వారికి నోటీసు కూడా ఇచ్చానని చెప్పింది. వాళ్ళు అద్దె చెల్లించేంతవరకు ఆ ఇంటి మరమ్మతులు చేయించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పింది. పోనీ మేమే ఆ పని చేస్తామన్నా ఆమె ఒప్పుకోలేదు. నా పర్మిషన్ లేకుండా మీరెలా చేస్తారని ప్రశ్నించింది. ఇక ఈ అధికారులు కూడా చేతులెత్తేసి ఆమె అనుమతి లేనిదే నీకు మేం సాయపడలేమని హేరీకి చెప్పి వెళ్లిపోయారు. జార్జియాలో ఇంకా ఇలాంటి ఇళ్ళు చాలానే ఉన్నాయని స్థానిక పత్రికలూ రాసుకొచ్చాయి.

మరిన్ని చదవండి ఇక్కడ : Rang De: నితిన్ కీర్తి సురేష్ రంగ్ దే మూవీ ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే…?? ( వీడియో ) Manchu Vishnu: కూతుళ్లు ఛాలెంజ్ తో మోహన్ బాబు కి షాక్ ఇచ్చిన మంచు విష్ణు… ( వీడియో )

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu