AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Boris Johnson: రహస్యంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం.. చివరి నిమిషంలో అతిథులకు ఆహ్వానం!

Boris Johnson: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్‌ను శనివారం రహస్య వేడుకలలో వివాహం చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్ చర్చిలో ఈ వేడుకలు జరిగాయని బ్రిటిష్ మీడియా నివేదికలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది.

Boris Johnson: రహస్యంగా బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ వివాహం.. చివరి నిమిషంలో అతిథులకు ఆహ్వానం!
Boris Johnson
KVD Varma
|

Updated on: May 30, 2021 | 3:21 PM

Share

Boris Johnson: బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్, క్యారీ సైమండ్స్‌ను శనివారం రహస్య వేడుకలలో వివాహం చేసుకున్నారు. వెస్ట్ మినిస్టర్ కేథడ్రల్ చర్చిలో ఈ వేడుకలు జరిగాయని బ్రిటిష్ మీడియా నివేదికలను ఉటంకిస్తూ వార్తా సంస్థ రాయిటర్స్ తెలిపింది. అయితే, జాన్సన్ డౌనింగ్ స్ట్రీట్ కార్యాలయ ప్రతినిధి ఈ నివేదికలపై స్పందించడానికి నిరాకరించారు. బ్రిటీష్ వార్తాపత్రికలు ది సన్ అండ్ మెయిల్ ఆదివారం ప్రచురించిన నివేదికల ప్రకారం, వివాహానికి వచ్చిన అతిథులందరినీ చివరి నిమిషంలో ఆహ్వానించారు. ఈ వివాహం గురించి సమాచారం సీనియర్ అధికారులకు కూడా ఇవ్వలేదు. కరోనా కారణంగా యుకెలో, వివాహానికి 30 మందికి మాత్రమే అనుమతి ఉంది.

జాన్సన్ 2019 లో ప్రధాని అయినప్పటి నుండి తన 33 ఏళ్ల కాబోయే భార్య క్యారీ సైమండ్స్‌తో డౌనింగ్ స్ట్రీట్‌లో నివసిస్తున్నారు. గత సంవత్సరం ప్రారంభంలో, ఆయన క్యారీ తో తన సహాజీవన సంబంధాన్ని బయట పెట్టారు. తమకు బిడ్డ పుట్టబోతున్నట్టు ప్రకటించారు. వారికి 2020లో ఒక బాబు పుట్టాడు. అతనికి విల్ఫ్రెట్ లారీ నికోలస్ జాన్సన్ అని పేరు పెట్టారు. ఒక నెల క్రితం ప్రచురించిన ఒక వార్త ప్రకారం 2020 జూలైలోనె వీరిద్దరి వివాహ ఆహ్వానాలను స్నేహితులు, కుటుంబ సభ్యులకు పంపారు. అయితే, అప్పుడు అది వాయిదా పడింది.

ప్రధాన మంత్రి జాన్సన్ యొక్క ప్రైవేట్ జీవితం ఎప్పుడూ చాలా క్లిష్టంగానె ఉంది. ఆయన ఇప్పటివరకు రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. మొదట 1987 లో అల్లెగ్రా మస్టిన్-ఓవెన్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. కానీ, ఇద్దరూ 1990 లో విడిపోయారు. ఆ తర్వాత బాల్య స్నేహితురాలు, న్యాయవాది మెరీనా వీలర్‌ను వివాహం చేసుకున్నారు. వారిద్దరికి నలుగురు పిల్లలు. ఇద్దరూ సెప్టెంబర్ 2018 లో విడిపోయారు. వివాహేతర సంబంధం గురించి అబద్ధాలు చెప్పినందుకు ఆయనను ఒకసారి కన్జర్వేటివ్ పార్టీ విధాన బృందం నుండి తొలగించారు.

Also Read: Wedding Prank Video: కాబోయే వాడిని భ‌లే బురిడీ కొట్టించిన యువ‌తి.. ఆక‌ట్టుకుంటోన్న ప్రాంక్ వీడియో..

Bio War: బయో వార్ వైపు ప్రపంచం.. వైరస్ లను పెంచుతున్న దేశాలు..ప్రజలకు ఇక క్రిములతో సహజీవనమే!