AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Cabinet Meeting highlights: తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..

KCR Cabinet Meeting on Lockdown: తెలంగాణ మంత్రివర్గ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు.

TS Cabinet Meeting highlights: తెలంగాణలో మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు.. ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం..
Shiva Prajapati
| Edited By: Ram Naramaneni|

Updated on: May 31, 2021 | 6:03 AM

Share

KCR Cabinet Meeting on Lockdown: ప్రగతి భవన్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం నాడు జరిగిన కేబినెట్ మీటింగ్‌లో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు విధించిన లాక్‌డౌన్‌ను జూన్ 10వ తేదీ వరకు పొడిగించింది. అదే సమయంలో ప్రస్తుతం ఉన్న 4 గంటల సడలింపు సమయాన్ని 6 గంటలకు పెంచింది. అంటే.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటలకు ఉన్న సడలింపు సమయాన్ని ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పెంచారు. అలాగే మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు ప్రజలు తమ తమ ఇళ్లకు చేరేందుకు సమయం ఇచ్చారు. ఇక 2 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీనికి సంబంధించి గైడ్‌లైన్స్‌ను కేబినెట్ బేటీ అనంతరం విడుదల చేయనున్నారు.

ఇదే సమయంలో జూన్ 2వ తేదీన రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. వేడుకలను నిరాడాంబరంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను కరోనా ఆంక్షల మధ్యలో హడావుడి లేకుండా నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. అలాగే.. కరోనా వ్యాక్సినేషన్‌లో విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 1000 కోట్లు కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది.  వీటితో పాటు తెలంగాణ కేబినెట్ మరికొన్ని కీలక అంశాలపై నిర్ణయం తీసుకుంది. కేబినెట్ భేటీ అనంతరం వాటికి సంబంధించిన వివరాలను ప్రభుత్వ వర్గాలు వెల్లడించనున్నాయి.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 May 2021 10:05 PM (IST)

    తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. నెక్లెస్ రోడ్డుకు పీవీ నరసింహారావు పేరు..

    ప్రగతి భవన్‌లో ఆదివారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. లాక్‌డౌన్ పొడిగింపు సహా అనేక అంశాలపై తీర్మానాలు చేశారు. వాటిలో ముఖ్యంగా దివంగత నాయకులు, మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. పీవీ శత జయంతుత్సవాల ముగింపు సందర్భంగా ఆయనకు నివాళిగా నెక్లెస్ రోడ్డు పేరును పీవీఎన్ఆర్ మార్గ్‌గా మార్చాలని తీర్మానించారు.

  • 30 May 2021 07:52 PM (IST)

    భూములు, ఆస్తులు, వాహనాల రిజిస్ట్రేషన్‌కు తెలంగాణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్..

    లాక్ డౌన్ పొడిగింపు నేపథ్యంలో తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొవిడ్ నిబంధనల సడిలింపు నేపథ్యంలోనే.. ప్రభుత్వ పనిదినాల్లో, స్టాంప్స్ అండ్ రిజిష్ట్రేషన్ల శాఖ ఆధ్వర్యంలో జరిగే భూములు, ఆస్తుల రిజిష్ట్రేషన్లతో పాటు, రవాణాశాఖ ఆధ్వర్యంలో జరిగే వాహనాల రిజిస్ట్రేషన్ కార్యకలాపాలకు అనుమతించాలని కేబినెట్ నిర్ణయించింది.

  • 30 May 2021 07:06 PM (IST)

    లాక్‌డౌన్ సహా అనేక అంశాలపై కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ మంత్రివర్గం..

    కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి సహా అనేక అంశాలపై తెలంగాణ సర్కార్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే లాక్‌డౌన్‌ను పొడిగించాలని నిర్ణయించిన కేబినెట్.. రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను నిరాడంబరంగా జరుపుకోవాలని తీర్మానించారు. అలాగే. మరో పదేళ్లపాటు బీసీ రిజర్వేషన్ల పెంపునకు కేబినెట్ ఓకే చెప్పింది. వైద్య, ఆరోగ్య శాఖకు రూ. 1000 కోట్లు కేటాయింపునకు మంత్రివర్గం ఆమోదముద్రం వేసింది.

  • 30 May 2021 06:55 PM (IST)

    తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ప్రాధాన్యత..

    కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్ విషయంలో విదేశాలకు వెళ్లే విద్యార్థులకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు అక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

  • 30 May 2021 06:49 PM (IST)

    లాక్‌డౌన్ సమయం వేళల్లో మార్పులు.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు..

    లాక్‌డౌన్ అంశంపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు. అయితే, లాక్‌డౌన్ సమయాన్ని సడలించారు. ఇప్పటి వరకు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల ఉన్న సడలింపు సమయాన్ని ఇప్పుడు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పెంచారు. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల లోపు అందరూ ఇళ్లకు చేరుకోవాలని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి తిరిగి ఉదయం 6 గంటల వరకు కఠినంగా లాక్‌డౌన్ అమలు చేయడం జరుగుతుందన్నారు.

  • 30 May 2021 06:40 PM (IST)

    కీలక ప్రకటన చేసిన తెలంగాణ సర్కార్.. మరో 10 రోజులు లాక్‌డౌన్ పొడిగింపు..

    లాక్‌డౌన్ అంశంపై తెలంగాణ సర్కార్ ఆదివారం నాడు కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో మరో 10 రోజుల పాటు లాక్‌డౌన్ పొడించారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం సమావేశంలో నిర్ణయించారు.

  • 30 May 2021 04:26 PM (IST)

    లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ముందున్న ఆప్షన్లు ఇవే.. అవేంటో ఇప్పుడు చూద్దాం..

    రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతూనే ఉంది. ప్రతీ రోజూ నమోదయ్యే పాజిటీవ్ కేసులు మూడు వేలకు పైగానే నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొనసాగిస్తుందా? లేక అన్ లాక్ చేస్తుందా? లాక్‌డౌన్ కొనసాగిస్తునే సడలింపులు ఇస్తుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే, లాక్‌డౌన్‌పై ప్రభుత్వం ముందు కొన్ని ఆప్షన్లు కనిపిస్తున్నాయి. ఆ ఆప్షన్లేంటో ఇప్పుడు చూద్దాం.

    1. ఇప్పుడు ఉన్నట్లుగానే లాక్‌డౌన్‌ను కొనసాగించడం. 2. ఉదయం 6 గంటల నుంచి 12 గంటల వరకు సడలింపు ఇవ్వడం. 3. వీకెండ్స్‌లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం. 4. నైట్ కర్ఫ్యూ విధించడం. 5. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు మరికొన్నింటికి సడలింపులు ఇవ్వడం. 6. కేసులు ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో సంపూర్ణ లాక్‌డౌన్ విధించడం. 7. ప్రస్తుతం లాక్‌డౌన్ పొడిగిస్తే వారం రోజు పొడిగించాలా? పది రోజులా? అనే అంశాలపై సర్కార్ సమాలోచనలు జరుపుతోంది.

  • 30 May 2021 04:14 PM (IST)

    ప్రగతి భవన్‌లో కొనసాగుతున్న మంత్రివర్గం సమావేశం.. కీలక అంశాలపై చర్చ..

    ప్రగతి వేదికగా.. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రి మండలి సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి, కరోనా థర్డ్ వేవ్, పిల్లలు కరోనా బారిన పడుకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్‌డౌన్ కొనసాగింపు, వ్యవసాయం రంగం, పంటల కొనుగోళ్లు, విత్తనాల పంపిణీ, కల్తీ ఎరువులు, బీసీ రిజర్వేషన్ల పెంపు సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు.

  • 30 May 2021 03:06 PM (IST)

    తెలంగాణలో లాక్‌డౌన్ పొడిగించొద్దు.. రాష్ట్ర ప్రభుత్వానికి ఎంపీ అసదుద్దీన్ విజ్ఞప్తి..

    తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ పొడిగించొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. సాయంత్రం 6 గంటల నుంచి కర్ఫ్యూ పెట్టాలని అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినీ లాక్ డౌన్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు.

  • 30 May 2021 02:58 PM (IST)

    లాక్‌డౌన్ పొడగింపు.. సడలింపులపై కీలక ప్రకటన చేయనున్న తెలంగాణ సర్కార్..

    ఆదివారం నాడు ప్రగతి భవన్ వేదికగా జరుగుతున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ పొడగింపు సహా.. లాక్‌డౌన్ మినహాయింపులపై సీరియస్ చర్చ జరుగుతోంది. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్ని వర్గాలకు సడలింపులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే సడలింపులు ఇస్తే మళ్లీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉండొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై క్లారిటీ రావాలంటే మంత్రివర్గ సమావేశం ముగిసిన తరువాతే.

  • 30 May 2021 02:53 PM (IST)

    బీసీ రిజర్వేషన్లు పదేళ్లకు పెంపు.. ఆమోదించనున్న తెలంగాణ మంత్రివర్గం..

    తెలంగాణలో బీసీ రిజర్వేషన్లను మరో పదేళ్ల పాటు పెంచనున్నారు. ఈ అంశానికి సంబంధించిన ఫైలుకు నేటి కేబినెట్ మీటింగ్‌లో తెలంగాణ మంత్రివర్గం ఆమోదించనుంది.

  • 30 May 2021 02:51 PM (IST)

    ప్రగతి భవన్‌లో ప్రారంభమైన తెలంగాణ కేబినెట్ మీటింగ్.. కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం..

    హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. లాక్‌డౌన్ పొడగింపు సహా, సడలింపులు, ఇతర అంశాలపై సీరియస్‌గా చర్చిస్తున్నారు.

  • 30 May 2021 02:44 PM (IST)

    వ్యవసాయ రంగంపై కీలక నిర్ణయం తీసుకోనున్న తెలంగాణ మంత్రివర్గం..

    రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడంతో దాని ప్రభావం ముఖ్యంగా వ్యవసాయ రంగంపై పడింది. సరిగ్గా వరికోతలు పూర్తయి పంట అమ్మకాలు జరిగే సమయంలో లాక్‌డౌన్ విధించడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐకేపీ కేంద్రాల్లో పంట కొనుగోళ్లు సమయానికి జరుగక.. అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట పాడైపోవడంతో రైతులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే నేటి మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ రంగంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్.

  • 30 May 2021 02:27 PM (IST)

    లాక్‌డౌన్ పొడగింపు?.. మరిన్ని సడలింపులు ఉంటాయా?.. తెలంగాణ మంత్రివర్గం ఏ నిర్ణయం తీసుకుంటుంది?..

    తెలంగాణలో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో మరోసారి లాక్‌డౌన్ విధించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం లాక్‌డౌన్ గడువు రేపటితో ముగియనుండగా.. మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడగించాలని ప్రభుత్వం భావిస్తోందట. అయితే, ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే లాక్‌డౌన్ సడలింపులు ఉండగా.. ఆ సమయాన్ని పెంచే అవకాశం కనిపిస్తోంది.

  • 30 May 2021 02:23 PM (IST)

    తెలంగాణలో మరో పది రోజులు లాక్‌డౌన్ పొడగింపు..? మంత్రివర్గం నిర్ణయం అదేనా..?

    తెలంగాణలో మరో పది రోజుల పాటు లాక్‌డౌన్‌ను పొడించే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఇవాళ జరుగుతున్న మంత్రివర్గ సమావేశంలో లాక్‌విధింపుపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు విశ్వసనీయ సమాచారం అందుతోంది. అయితే ప్రస్తుతం ఉన్న సడలింపు సమయాన్ని గంట లేదా రెండు గంటలు పెంచుతారనే ప్రచారం జరుగుతోంది.

  • 30 May 2021 01:55 PM (IST)

    లాక్‌డౌన్ విధింపు.. ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాట, తమిళనాడు బాటలోనే తెలంగాణ పయనం..?

    కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు బాటలోనే నడిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ రాష్ట్రాల ప్రభుత్వాలు ఇప్పటికే మరో పది రోజుల పాటు లాక్‌డౌన్ పొడగిస్తూ ఉత్తర్వులు జారీ చేశాయి. తెలంగాణలో రేపటిలో లాక్‌డౌన్ గడువు ముగియనుంది. దాంతో తెలంగాణ సర్కార్ కూడా పొరుగు రాష్ట్రాల మాదిరిగానే లాక్‌డౌన్ విధించే అవకాశం కనిపిస్తోంది.

  • 30 May 2021 01:53 PM (IST)

    కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను తెలంగాణ ప్రభుత్వం పాటిస్తుందా?.. జూన్ 30 వరకు లాక్‌డౌన్ పెడతారా?..

    రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం.. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలను పాటిస్తుందా? కేంద్రం సూచించినట్లుగా తెలంగాణలో జూన్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్ విధిస్తారా? అనే సందేహాలకు మరికాసేపట్లో తెర పడనుంది. ఇవాళ జరగనున్న తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో లాక్‌డౌన్ కొనసాగింపు, అన్‌లాక్ చేయడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు.

Published On - May 30,2021 10:05 PM