AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Medical Colleges: తెలంగాణలో మరో ఏడు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్.. ఎక్కడంటే?

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్‌లో

Medical Colleges: తెలంగాణలో మరో ఏడు మెడికల్ కళాశాలల ఏర్పాటుకు గ్రీన్‌ సిగ్నల్.. ఎక్కడంటే?
Shaik Madar Saheb
|

Updated on: May 30, 2021 | 8:48 PM

Share

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో కొత్తగా ఏడు వైద్య కళాశాలల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆదివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో.. ఏడు వైద్యకళాశాలలకు ఆమోదం లభించింది. మహబూబాబాద్‌, సంగారెడ్డి, జగిత్యాల, నాగర్‌కర్నూల్‌, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాల్లో కొత్తగా ఈ కళాశాలలు ఏర్పాటు కానున్నాయి. వైద్య కళాశాలల ఏర్పాటుతో ప్రజలకు స్థానికంగా మెరుగైన వైద్య సేవలు అందుతాయని ప్రభుత్వం వెల్లడించింది. గతంలోనే సీఎం కేసీఆర్‌ మహబూబాబాద్‌, జగిత్యాల జిల్లాలకు వైద్య కళాశాలలు కేటాయిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన హామీని నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్ చేశారు.

ఇదిలాఉంటే.. ఈ రోజు జరిగిన కేబినేట్ సమావేశంలో లాక్‌డౌన్ గడువును తెలంగాణ ప్రభుత్వం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. జూన్ 10 వరకూ లాక్‌డౌన్ గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతోపాటు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ఉన్న సడలింపును మధ్యాహ్నం 1 గంట వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. బయటకు వెళ్లిన వారు 2 గంటల వరకు ఇళ్లకు వెళ్లేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం

Also Read:

Flax Seeds Benefits: అవిసె గింజలతో బరువు సులువుగా తగ్గొచ్చు తెలుసా..? ఇంకా లాభాలు తెలిస్తే షాకే..

Viral Video: కొలనులో నీరు తాగుతున్న చిరుత పులి ఒక్కసారిగా భయంతో పరుగులు తీసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..