Viral Video: కొలనులో నీరు తాగుతున్న చిరుత పులి ఒక్కసారిగా భయంతో పరుగులు తీసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..

Viral Video: ప్రకృతిలో వింతలు, విశేషాలకు కొదవ లేదు. అనునిత్యం ఎక్కడోచోట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంది.

Viral Video: కొలనులో నీరు తాగుతున్న చిరుత పులి ఒక్కసారిగా భయంతో పరుగులు తీసింది.. కారణం తెలిస్తే షాక్ అవుతారు..
Leopard
Follow us
Shiva Prajapati

|

Updated on: May 30, 2021 | 8:32 PM

Viral Video: ప్రకృతిలో వింతలు, విశేషాలకు కొదవ లేదు. అనునిత్యం ఎక్కడోచోట ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంటుంది. ఇక అడవుల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అడవి జంతువుల జీవితం నిత్యం జీవన్మరణ పోరాటమే అని చెప్పాలి. కొన్ని జంతువులు అడవి ఫలాలు, చెట్లను తిని జీవిస్తే.. మరొకొన్ని క్రూర మృగాలు జంతువులనే తిని జీవిస్తాయి. అలా నిత్యం ఎదురయ్యే ప్రమాదాలను దాటుకుంటూ ప్రతీ జంతువు జీవిత పోరాటం చేయాల్సిందే. ఇదింతా ఇలా ఉంటే.. తాజాగా చిరుత పులికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

ఇండియన్ ఫారెస్ట్ ఆఫీసర్ సురేందర్ మెహ్రా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ వీడియోలో ఎముందో ఇప్పుడు తెలుసుకుదాం. ఆ వీడియో క్లిప్‌లో దాహార్తితో ఉన్న ఓ చిరుత పులి నీరు తాగేందుకు.. గడ్డి మొక్కలతో నిండి ఉన్న ఒక కొలను వద్దుకు వచ్చింది. భయపడుతూనే అడుగులు ముందుకు వేసిన చిరుత.. అదే భయంతో బిక్కు బిక్కుమంటూ నీటిని తాగింది. అయితే, చిరుత రాకను గమనించి నీటి అడుగులో మాటు వేసిన మొసలి.. అదును చూసి చిరుతపై అటాక్ చేసింది. అయితే మొదటి నుంచి అలర్ట్‌గా చిరుత ఒక్క ఉదుటున పైకి ఎగిరింది. మొసలికి చిక్కకుండా పరుగు లంకించుకుంది. కొంచెం తేడా అయినా చిరుత పులి.. నీటిలోని మొసలికి ఆహారంగా మారేది. అదృష్టం కొద్ది అది బ్రతికిపోయింది. అయితే, ఈ వీడియోను ఫారెస్ట్ ఆఫీసర్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇప్పుడది వైరల్‌గా మారింది. 14 సెకన్ల ఈ వీడియోకు సెకన్ల వ్యవధిలోనే వేలల్లో వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు తమకు తోచినట్లుగా స్పందిస్తున్నారు.

Viral Video:

Also read:

Etela in Delhi : ఢిల్లీ చేరుకున్న ఈటెల రాజేందర్.. రెండు రోజుల పర్యటనలో బిజెపి అగ్రనేతలను కలిసే అవకాశం.!

మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
భార్య కోసం భర్త రిటైర్మెంట్‌.. పాపం ఇలా జరిగిందేటబ్బా..!
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
ఎవర్రా మీరంతా ఇలా ఉన్నారు..? సంతకం కోసం బ్యాట్‌ వదిలిన అభిమాని..
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
అభిమానులతో సెల్ఫీలు.. కట్‌చేస్తే.. ఆసీస్ సెన్సేషన్‌‌కు బిగ్ షాక్?
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
కుంభ మేళాలో వీఐపీల కోసం సర్క్యూట్ హౌస్ ఏర్పాటు సౌకర్యాలు ఏమిటంటే
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..
సీఎంతో సినీ ప్రముఖుల భేటీ..