Flax Seeds Benefits: అవిసె గింజలతో బరువు సులువుగా తగ్గొచ్చు తెలుసా..? ఇంకా లాభాలు తెలిస్తే షాకే..
Health Benefits of Flax Seeds: అవిసె గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అవిసె గింజల్లో బరువును తగ్గించే అనేక గుణాలున్నాయి. ఇలాంటి మేలు చేసే అవిసె గింజల
Health Benefits of Flax Seeds: అవిసె గింజల ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే.. అవిసె గింజల్లో బరువును తగ్గించే అనేక గుణాలున్నాయి. ఇలాంటి మేలు చేసే అవిసె గింజల గురించి చాలామందికి పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు. కానీ వీటి గురించే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకుంటే.. మాత్రం అస్సలు వదిలిపెట్టరంటున్నారు నిపుణులు. అయితే.. ఈ అవిసె గింజలను రోజూవారి ఆహారంలో తీసుకుంటే.. ఎన్నో రకాల రోగాల నుంచి ఉపశమనం పొంది ఆరోగ్యవంతంగా బలంగా ఉండవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. దీంతోపాటు అవిసె గింజలను వేయించి పొడి చేసి ఆహార పదార్ధాలలో కలుపుకొని తినవచ్చు. దీంతోపాటు పొడి చేసి నీటిలో కలుపుకొని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
గుండెకు మేలు..
ఈ అవిసె గింజల్లో అధికంగా ఫైబర్ ఉంటుంది. దీంతో ఒమేగా-3, యాంటీ ఇన్ఫెమేటరీ స్వభావం ఎక్కువగా ఉంటాయి. వీటిని తీనడం వల్ల గుండెకు మేలు జరుగుతుందని.. హృదయ సంబంధిత వ్యాధులనుంచి ఉపశమనం పొందవచ్చని పేర్కొంటున్నారు.
నొప్పులతో ఉపశమనం..
కీళ్ల నొప్పులు, వాపులు, కీళ్ల వాతం నిర్మూలనకు అవిసె గింజలు దివ్యఔషధంలా పనిచేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల నొప్పుల సమస్య నుంచి బయటపడొచ్చు.
జీర్ణక్రియకు..
అవిసె గింజలు రోజూ ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ప్రక్రియ మెరుగుపడుతుంది. అతిసారం, మలబద్ధకం వంటి సమస్యలు తొలిగిపోతాయి. ఉదరం సమస్యలను నియంత్రిస్తాయి. ఫలితంగా బరువు కూడా తగ్గవచ్చు.
మధుమేహం..
రక్తంలోని షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో అవిసెగింజలు బాగా సహాయపడతాయి. వీటిని తరచూ తీసుకుంటే మధుమేహం బారిన త్వరగా పడే అవకాశముండదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు.
క్యాన్సర్ కారకాల నుంచి రక్షణ
పలు రోగాలకు సంజీవనిగా అవిసె గింజలు దోహదపడతాయి. పలు క్యాన్సర్ కారకాల ప్రమాదాలను అవిసె గింజలు అడ్డుకుంటాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: