Hyderabad: గణేష్ నిమజ్జనం రోజు ర్యాలీలను రద్దు చేసుకున్న ముస్లిం మత పెద్దలు.. అర్ధరాత్రి ప్రత్యేక సమావేశం
ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం మిలాదున్ నబి ఊరేగింపు ఒకే రోజు రావడంతో.. విగ్రహ నిమర్జనంలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా మీలాదున్ నబి ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు పాతబస్తీ మత పెద్దలు దక్షిణ మండలం డీసీపీతో ప్రత్యేక సమావేశం అనంతరం వెల్లడించారు. ఎంతో ఉత్కంఠ లేపిన మీలాదున్ నబి ర్యాలీలపై పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు.

ఎంతో పవిత్రంగా భావించే ఎంతో సంతోషంగా జరుపుకుంటే మహమ్మద్ ప్రవక్త పుట్టిన రోజు మీలాదున్ నబి సంబరాలను రద్దు చేసుకున్నారు ముస్లిం మత పెద్దలు. గణేష్ నిమర్జనం మీలాదున్ నబి ఒకే రోజు రావడం ప్రజలకు చాలా ఆనందంగా ఉంటే మరోవైపు అదే రోజు రెండు వర్గాలకి ఇబ్బందులు కలుగుతాయేమోనని ఉన్నత స్థాయి అధికారులు ఇరు వర్గాలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. మీలాదున్ నబి రోజు పాత బస్తీలో సుమారు 40 ముస్లిం సంస్థలు వందలాది మంది ప్రజలతో శాంతియుత ర్యాలీలు నిర్వహిస్తారు. అయితే ఈ సంవత్సరం వినాయక నిమజ్జనం మిలాదున్ నబి ఊరేగింపు ఒకే రోజు రావడంతో.. విగ్రహ నిమర్జనంలో ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తగా మీలాదున్ నబి ర్యాలీలు రద్దు చేస్తున్నట్టు పాతబస్తీ మత పెద్దలు దక్షిణ మండలం డీసీపీతో ప్రత్యేక సమావేశం అనంతరం వెల్లడించారు.
ఎంతో ఉత్కంఠ లేపిన మీలాదున్ నబి ర్యాలీలపై పోలీసులు ఉన్నత స్థాయి అధికారులు పలుమార్లు సమావేశాలు ఏర్పాటు చేశారు. ఒకే రోజు రెండు వర్గాలకి పండగలు రావడంతో నిమర్జనం రోజు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్తగా ముస్లిం సంస్థలను ఒప్పించడంలో దక్షిణ మండలం డిసిపి చాలావరకు విజయం సాధించారు. బహుశా చరిత్రలో మీలాదున్ నబి ర్యాలీలో రద్దు చేసుకోవడం ఇదే మొదటిసారి ఉండవచ్చు.
మరోవైపు ఎవరైనా ర్యాలీలు ఇతర కార్యక్రమాలు నిర్వహించుకోవాలంటే పోలీస్ అనుమతులు తీసుకోవాలని పోలీసుల సూచనల మేరకే నడుచుకోవాలని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ప్రజల్ని విజ్ఞప్తి చేశారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో ఇద్దరి పండుగలు ఒకేరోజు రావడంతో ఒకరి వల్ల మరొకరికి ఇబ్బందులు కలగాకుండా ఉండటానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమావేశమైన మత పెద్దలు వెల్లడించారు. మత పెద్దల వెల్లడితో అటు పోలీసు అంతరాంగం ఇటు ఆందోళనలో ఉన్న ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేశారు.
పాత బస్తి లాంటి సెన్సిటివ్ ఏరియాలో మత పెద్దలని ప్రజలని ఏకతాటిపై తీసుకువచ్చి ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ముస్లిం మత పెద్దలను ఒప్పించడంలో దక్షిణ మండలం డిసిపి సాయి చైతన్య విజయం సాధించారంటూ ముస్లిం సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




