AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valmidi Ramalayam: వల్మిడిలో సీతమ్మ విగ్రహ ప్రతిష్టపై వస్తున్న ఆరోపణపై పండితుల క్లారిటీ.. ఆగమ ధర్మ శాస్త్రాన్ని తప్పు దోవ పట్టించవద్దంటూ విన్నపం..

జనగామ జిల్లా పాలకుర్తి నియోకవర్గం వాల్మికి- వల్మిడి గ్రామంలోని రామాలయంలో విగ్రహ ప్రతిష్టావివాదం కొనసాగుతుంది. సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్టాపనపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు వేద పండితుల తో పాటు ఆలయ పూజారులు. సోషల్ మీడియాలో విగ్రహ ప్రతిష్టపై దుస్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Valmidi Ramalayam: వల్మిడిలో సీతమ్మ విగ్రహ ప్రతిష్టపై వస్తున్న ఆరోపణపై పండితుల క్లారిటీ.. ఆగమ ధర్మ శాస్త్రాన్ని తప్పు దోవ పట్టించవద్దంటూ విన్నపం..
Valmidi Ramalayam
Surya Kala
|

Updated on: Sep 09, 2023 | 10:07 AM

Share

హిందువుల మనసులో సీతారాములంటే ప్రత్యేక స్థానం ఉంది. భార్యాభర్తలు ఇద్దరును సీతారాముల్లా కలకలం జీవించాలని ఇంట్లోని కుటుంబ సభ్యులు మాత్రమే కాదు..  ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకనే సీతారాముల్లా జీవించండి అంటూ దీవిస్తారు కూడా అయితే ఇపుడు ఒక ఆలయంలో రామయ్య సీతమ్మల విగ్రహ ప్రతిష్టాపన విషయంలో వివాదనం నెలకొంది. తెలంగాణలోని వల్మిడిలో సీతమ్మ విగ్రహప్రతిష్టపై వస్తున్న ఆరోపణపై వేద పండితులు క్లారిటీ ఇచ్చారు. సనాతన ధర్మం తెలియని వ్యక్తులు ప్రజల్లోకల్లోలం సృష్టించి ఆగమ ధర్మ శాస్త్రాన్ని తప్పు దోవ పట్టించోద్దని కోరారు వేదపండితులు.

జనగామ జిల్లా పాలకుర్తి నియోకవర్గం వాల్మికి- వల్మిడి గ్రామంలోని రామాలయంలో విగ్రహ ప్రతిష్టావివాదం కొనసాగుతుంది. సీతారామ లక్ష్మణుల విగ్రహ ప్రతిష్టాపనపై సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఈ వివాదంపై వివరణ ఇచ్చారు వేద పండితుల తో పాటు ఆలయ పూజారులు. సోషల్ మీడియాలో విగ్రహ ప్రతిష్టపై దుస్ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆగమశాస్త్రం ప్రకారమే విగ్రహప్రతిష్ట చేశామని చెప్పారు. ఫోటోల్లో చూసి తప్పుబట్టడం కరెక్ట్ కాదన్నారు వేద పండితులు.

వైష్ణవ సంప్రదాయ పద్ధతిలో సీతమ్మ వారు రాముడికి కుడివైపే ఉండాలని సాక్షాత్తు నారాయణుడే చెప్పారని తెలిపారు. కొందరు వ్యక్తిగత ప్రయోజనాల కోసం శాస్త్రాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని… సనాతన ధర్మంపై అవగాహన లేని వ్యక్తులు పని గట్టుకొని విష ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. భద్రాద్రిలో రాముడిపై సీతమ్మవారు కూర్చుంటుంది కాబట్టే ఎడమ వైపు ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. వల్మిడిలో సీతమ్మవారు నిలుచొని ఉంటారు కనుక.. అందుకే రాముడికి కుడివైపు ఉంటారని తెలిపారు. ప్రజల్లో కల్లోలం సృష్టించి ఆగమ ధర్మా శాస్త్రాన్ని తప్పుదోవ పట్టించొద్దని సూచించారు వేదపండితులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..